
None other than Naga Chaitanya and Samantha have divorced in the film industry?
Samantha: ఒకప్పుడు మోస్ట్ లవబుల్ జంట అంటే సమంత, నాగ చైతన్య పేరు చెప్పేవాళ్లు. అట్టహాసంగా పెళ్లి చేసుకున్న ఈ జంట అనివార్య కారణాల వలన విడాకులు తీసుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 2న ఈ జంట విడాకులు తీసుకోగా, ఈ నిర్ణయం ప్రతి ఒక్కరిని బాధించింది.ఇప్పటి వరకు వారు ఎందుకు విడాకులు తీసుకున్నారో తెలియదు కాని వారి డైవర్స్ ఇష్యూపై ఎన్నో వార్తలు వచ్చాయి. ఎంతో అన్యోన్యంగా ఉండే నాగచైతన్య మరియు సమంత విడాకుల విషయం ఇప్పటికే చాలా మంది అభిమానులు జీర్ణించుకోలేని ఒక చేదు నిజం గా మారిన సంగతి తెలిసిందే.
“ఏ మాయ చేసావే” అనే సినిమాతో మొట్టమొదటిసారిగా కలిసి నటించిన నాగచైతన్య మరియు సమంత తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఆ తర్వాత “ఆటో నగర్ సూర్య”, “మనం” వంటి సినిమాల్లో కూడా కలిసి నటించిన ఈ జంట పెళ్లి తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్లో “మజిలీ” అనే సినిమాతో మరొక హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాలో చైతూ, సమంత చాలా రొమాంటిక్‌గా కనిపించి ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు.
samantha shares naga chaitanya poster
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన మజిలీ చిత్రం మూడేళ్లు పూర్తైన సందర్భంగా సమంత చైతూ సీరియస్ లుక్ పోస్టర్‌తో పాటు రొమాంటిక్ పోస్టర్ షేర్ చేసింది. 3 ఏళ్ల మజిలీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత సమంత పోస్ట్‌లో చైతూ పిక్ ప్రత్యక్షం కావడంతో అక్కినేని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే విడాకుల అనంతరం కుంగిపోయిన సమంత.. చైతూతో గడిపిన జ్ఞాపకాలను చెరిపివేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి నాగ చైతన్య ఫోటోలను డిలీట్ చేసిన సామ్ రీసెంట్‌గా అతన్ని అన్‌ఫాలో కూడా చేసేసింది. అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున,రానా, వెంకటేష్ కుమార్తె ఆశ్రితలను ఇంకా ఫాలో అవుతున్న సామ్ చైతన్యను మాత్రమే అన్‌ఫాలో చేసింది.
samantha shares naga chaitanya poster
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.