Home » Entertainment » Samantha Shares Will Smith Post
Entertainment

Samantha : నాకు ప్రాణహాని ఉంది… డబ్బు లాక్ చేయబడింది అంటూ స‌మంత షాకింగ్ కామెంట్

Authored By
Sam C
The Telugu News | Published on: February 25, 2022, 4:30 pm
Advertisement

Samantha: టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రైన స‌మంత ఇటీవ‌లి కాలంలో తెగ సంద‌డి చేస్తున్న విష‌యం తెలిసిందే. నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న అనంతరం తన సినిమా కెరీర్ పై మరింత ఫోకస్ పెట్టింది. డిఫరెంట్ ప్రాజెక్టులను కూడా ఓకే చేసేందుకు ముందుకు వెళుతోంది. కేవలం సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేసే విధంగా సమంత అడుగులు వేస్తోంది. ఐటెం సాంగ్స్‌లోను స్టెప్పులు వేసేందుకు సిద్ధంగా ఉంటుంది స‌మంత‌. అయితే ఈ ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో విల్ స్మిత్ కోట్ ను పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Advertisement

ప్రముఖ హాలీవుడ్ హాస్యనటుడు విల్ స్మిత్. .. విల్ పుస్తకం నుంచి ఓ కోట్ షేర్ చేయ‌గా, అందులో.. ” గత ముప్పై సంవత్సరాలుగా.. మనందరిలాగే.. ఒకటి. వైఫల్యం, నష్టం, అవమానం, విడాకులు, మరణంతో వ్యవహరించాము. నాకు ప్రాణహాని ఉంది. నా డబ్బు లాక్ చేయబడింది. నా వ్యక్తిగత విషయాలను అతిక్రమించారు. నా కుటుంబం విచ్ఛిన్నమైంది. ప్రతిరోజూ కాంక్రీట్ కలిపి.. ఇటుకను పేర్చాలి. మీరు ఏదారిలో వెళ్తున్నారో తెలియదు..కానీ అక్కడ ఎల్లప్పుడూ ఒక ఇటుక మీ ముందు ఉంటుంది.. అది కూడా పేర్చేందుకే ఉంది.. కానీ నువ్వు ఆ ఇటను పేరుస్తున్నావా ? ” అని ఉంది. ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

samantha shares will smith post

Advertisement

Samantha : స‌మంత పోస్ట్ ఉద్దేశం ఏంటి..!

స‌మంత ప్ర‌స్తుతం సినిమా షూటింగ్‌లు ఓ వైపు.. వెకేషన్లు మరో వైపు.. అంటూ సమంత దుమ్ములేపుతోంది. ఇక అడ్వెంచర్లు చేయడంలో సమంత ముందుంటోంది. సమంత చేతిలో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్‌లున్నాయి. ఆల్రెడీ శాకుంతలం సినిమా షూటింగ్ ముగిసింది. కరోనా వల్ల సినిమా కాస్త ఆలస్యమైంది. అయినా ప్రత్యేకంగా వేసిన సెట్లలో చకచకా షూటింగ్‌ను కానిచ్చేశారు.గత కొన్ని రోజులుగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాస్త ఆలస్యంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌గా, ఇది ఆక‌ట్టుకుంది..

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి