Home » Entertainment » Samantha Starts New Life
Entertainment

Samantha : విడాకులు తీసుకొని ఏడాది.. ఆ రోజు నుండి న్యూ లైఫ్ స్టార్ట్ చేసేందుకు స‌మంత స‌న్నాహాలు

Authored By
Sam C
The Telugu News | Updated on: October 23, 2022 1:10 pm
Advertisement

Samantha : అక్కినేని నాగ చైత‌న్య నుండి విడాకులు తీసుకున్న స‌మంత ప్ర‌స్తుతం సోలో లైఫ్ గ‌డుపుతుంది. ఈ అమ్మ‌డు ఒక‌వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు టూర్స్ వేస్తుంది. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే ఎనలేని స్టార్​డమ్ ను సంపాదించుకుంది. సమంత లైఫ్​ను పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అంటూ పోల్చి చూడొచ్చు. ప్ర‌స్తుతం సమంత కెరీర్ తారా జువ్వలా దూసుకుపోతోంది. శాకుంతలం, యశోద చిత్రాలతోపాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలకు కూడా కమిట్ అయింది ఈ బ్యూటి. విడాకుల తరువాత చాలా విమర్షలు ఎదుర్కుంది సమంత. చాలా మానసిక సంఘర్షనను ఫేస్ చేసింది.

Advertisement

కోలుకోవడానికి చాలా టైమ్ కూడా పట్టింది.ప్రస్తుతం సమంత చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పౌరాణిక నేపథ్యంతో శాకుంతలం సినిమా తెరకెక్కగా.. లేడి ఓరియెంటెడ్ గా యశోద మూవీ రానుంది. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే బజ్ క్రియట్ చేసింది. ఇటీవ‌ల చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా, ఈ టీజర్ లో సమంత.. గర్భవతిగా కనిపిస్తోంది. అయితే ఈ మూవీ గురించి ప్రస్తుతం ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అది ఏంటంటే ఈ మూవీ కథ. ఈ సినిమా కథ గురించి పలు లీకులు కూడా వస్తున్నాయి . న‌వంబ‌ర్ 11న ఈ సినిమా విడుద‌ల కానుండ‌గా, ఈ చిత్రానికి సంబంధించి మ‌రి కొద్ది రోజుల‌లో ప్ర‌మోష‌న్ స్టార్ట్ చేయ‌నుంది.

Samantha starts new life

Advertisement

Samantha : న్యూ లైఫ్ స్టార్ట్..

అంతేకాదు దీపావ‌ళి నుండి త‌న జీవితాన్ని ఫ్రెష్ గా స్టార్ట్ చేయబోతుందట. తన బిజినెస్ లు, సోషల్ మీడియా, సినిమాలు ఇలా అంతా కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకుంటుందట. అంతా ఓ పద్దతి ప్రకారం జరిగేలా ఇప్పటికే పథకాలు కూడా వేసుకుందట. మరీ ముఖ్యంగా తనను విడాకుల విషయంలో విమర్షించేవారికి ఘాటు తగిలేలా ప్లాన్ చేసుకుందట. తన జీవితంలో అక్కినేని అనే ప్రభావం లేకుండా.. సోలోగా సింగిల్ గానే జీవితాన్ని లీడ్ చేయాలని డిసైడ్ అయ్యిందట సమంత. సాధ్యమైనంత వరకూ క్రేజ్ ను పెంచుకుని తాను కూడా స్టార్ గా వెలుగు వెలగాలని చూస్తుందట సమంత.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి