samantha stunning looks killing the audience
Samantha: దక్షిణాది అగ్ర కథనాయికలలో సమంత ఒకరు. ఈ అమ్మడు జోరు ఇటీవలి కాలంలో మాములుగా లేదు. నాగచైతన్యతో వైవాహిక బంధాన్ని ముగించిన తర్వాత… ఆమె పూర్తిగా తన కరీర్ పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఆమె ముంబైలోనే ఎక్కువ సమయం గడుపుతోంది. అంతేకాదు, ఇటీవలి కాలంలో ఆమె మరింత గ్లామరస్ గా కనిపిస్తూ కుర్రకారును హుషారెత్తిస్తోంది.సమంత ఫొటో షూట్స్ కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ముఖ్యంగా తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంది. తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో కెమెరా కంటికి చిక్కిన సమంత చాలా క్యూట్ గా కనిపించింది. బ్లూ డెనిమ్ ప్యాంట్, రెడ్ టీషర్ట్ లో ఆమె తళుక్కున మెరిసింది. అంతేకాదు ఫొటోలకు కూడా పోజులిచ్చింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి.సమంత అందాలకు ప్రతి ఒక్కరు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. రోజురోజుకి సమంత బోల్డ్ నెస్ పెరుగుతూ పోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. శాకుంతలం షూటింగ్ పూర్తి చేసిన సమంత ప్రస్తుతం యశోద అనే చిత్రంతో పాటు కోలీవుడ్‌లో కాతువాకుల రెండు కాదల్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ట్రయాంగిల్ ప్రేమకథతో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతపతి, నయనతార నటించారు. నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
samantha stunning looks killing the audience
ఇక ఈ సినిమా ద్వారా నయనతార, సమంతల మధ్యఫ్రెండ్‌షిప్ మరింత బలపడినట్లు తెలుస్తుంది.రీసెంట్‌గా కోలీవుడ్ మూవీ షూటింగ్ పూర్తి అయిన నేపథ్యంలో చిత్ర బృందం కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంది. మరోవైపు సమంత కోసం నయనతార ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపించింది. ‘డియర్ ఖతీజా.. విత్ లవ్.. కణ్మణి’ అంటూ నయన్ సమంత కోసం కాస్ట్‌లీ గిఫ్ట్ పంపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. థ్యాంక్యూ డార్లింగ్ నయన్ అంటూ పోస్ట్ చేసింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదల కానుంది. కాగా ఈ చిత్రంతో పాటు శాకుంతలం, యశోద సినిమాలతో పాటు సామ్ హిందీలో ఓ వెబ్‌సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.