Home » Entertainment » Samantha Tattos Hot Topic Now
Entertainment

Samantha : చెర‌గ‌ని జ్ఞాపకాలు.. స‌మంత ఇంకా ఆ హీరోని ల‌వ్ చేస్తూనే ఉందా?

Authored By
Sam C
The Telugu News | Published on: June 11, 2022, 7:30 pm
Advertisement

Samantha : టాలీవుడ్ ముద్దుగుమ్మ స‌మంత నిత్యం ఏదో ఒక విష‌యంతో వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంటుంది. సినిమాలు, సోష‌ల్ మీడియా పోస్ట్‌ల‌తో పాటు అమ్మ‌డికి సంబంధించిన పుకార్లు కూడా స‌మంత హాట్ టాపిక్ అయ్యేలా చేస్తుంటాయి. స్టార్ బ్యూటీ సమంత మరియు యువ హీరో నాగచైతన్య ఇప్పటికే చాలా సినిమాల్లో కలిసి నటించారు. ఏ మాయ చేసావే సినిమా సెట్స్ పైన కలిసిన వీరిద్దరి స్నేహం ప్రేమగా మారి 2017 లో వీరు పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ టాలీవుడ్ స్టార్ కపుల్ గతేడాది విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఎవరిదారిన వారు సినిమాలు చేసుకుంటూ కరియర్ లో ముందుకు వెళ్తున్నారు.

Advertisement

అయినప్పటికీ కొన్ని విషయాలలో మాత్రం వారి వివాహ బంధాన్ని ఎప్పటికప్పుడు వారికి మరియు వారి అభిమానులకు గుర్తు చేస్తూనే వున్నాయి. స‌మంత‌- చైతూ విడిపోయిన‌ప్ప‌టికీ అక్కినేని హీరో జ్ఞాప‌కాలు మాత్రం ఇప్ప‌టికీ స‌మంత ద‌గ్గ‌ర‌గా ప‌దిలంగానే ఉన్నాయి. వారిద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు సమంత తన ఒంటి పైన వేయించుకున్న టాటూ లు మాత్రం ఇంకా జ్ఞాపకాలు లాగా అలానే ఉండిపోయాయి. సమంత నాగచైతన్యతో కలిసి నటించిన ఏ మాయ చేసావే సినిమాకి గుర్తుగా వై ఎం సి అని టాటూ వీపు పై వేయించుకుంది. ఆ తర్వాత సమంత మరియు నాగచైతన్య ఇద్దరు తమ వేలిపై యారో టాటూలు కూడా వేయించుకున్నారు.

samantha tattos hot topic now

Advertisement

Samantha : చెరిపేసుకోలేక‌పోతుందా?

తన భర్త పేరుని నడుము పై భాగంలో టాటూ వేయించుకుంది. కానీ విడాకుల తర్వాత కూడా ఆమె ఈ టాటూ లను తొలగించలేకపోయింది. రీసెంట్‌గా స‌మంత ఫొటో షూట్ చేయ‌గా, అందులో ‘చై’ పేరుతో ఉన్న టాటూ కనిపిస్తుండటంతో అందరి దృష్టి దానిపైనే పడింది. అలా, ఆమె టాటూ కాస్త మరోసారి వార్తల్లో నిలిచింది. విడాకుల తరువాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటోంది అన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే అంతకు ముందు ఎప్పుడు లేని విధంగా విడాకుల తర్వాత ఫోటో షూట్ లతో రెచ్చిపోతోంది. అయితే ఇదే విషయం పై అభిమానులు సమంతను ప్రశ్నించినప్పటికీ అభిమానులు మాత్రం తన పద్ధతిని మార్చుకోకపోగా మరింత రెచ్చిపోతోంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి