Home » Entertainment » Samantha Un Follows Naga Chaitanya
Entertainment

Samantha : అక్కినేని ఫ్యామిలీని కావాల‌నుకుంటున్న స‌మంత .. నాగ చైత‌న్య‌ని మాత్రం వ‌ద్ద‌నుకుంటుంది..!

Authored By
Sam C
The Telugu News | Updated on: March 22, 2022, 2:32 pm
Advertisement

Samantha : టాలీవుడ్ అంద‌మైన జంట‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందారు స‌మంత‌- నాగ చైత‌న్య‌. కాని అనివార్య కార‌ణాల వ‌ల‌న ఈ ఇద్ద‌రు విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత కుంగిపోయిన సమంత.. చైతూతో గడిపిన జ్ఞాపకాలను చెరిపివేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి నాగ చైతన్య ఫోటోలను డిలీట్‌ చేసింది. రీసెంట్‌గా అతన్ని అన్‌ఫాలో కూడా చేసేసింది. అయితే వారిద్దరూ విడిపోవడానికి కారణాలు అడుగుతూ ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. కాని దానికి స‌మాధానం మాత్రం అంతుచిక్క‌కుండా పోయింది.

Advertisement

విడాకుల త‌ర్వాతి నుండి సోషల్ మీడియాల్లో కొన్ని సందర్భాల్లో వీరిద్దరూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా కూడా మారారు. తాజాగా ఇప్పుడు మ‌రోసారి అలాగే జ‌రిగింది. విడిపోయిన త‌ర్వాత నాగ చైత‌న్య‌, స‌మంత ఒక‌రినొక‌రు సోష‌ల్ మీడియాలో ఫాలో కావ‌డం మానేశారు. ఇప్పుడు స‌మంత నాగ చైత‌న్య ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను అన్ ఫాలో చేసింది. కానీ ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే.. నాగ చైత‌న్య మాత్రం ఆమె ఇన్‌స్టా అకౌంట్‌ను అన్ ఫాలో చేయ‌లేదు. ఇక మ‌రో విష‌య‌మేమంటే నాగ చైత‌న్య‌ను అన్ ఫాలో చేసిన స‌మంత .. నాగార్జున‌, అమ‌ల‌, అఖిల్‌, ఆశ్రిత‌, రానా ద‌గ్గుబాటిల‌ను మాత్రం ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఇదే విష‌యం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

samantha un follows naga chaitanya

Advertisement

Samantha : ఈ మ్యాట‌ర్ ఎవ‌రికి అర్ధం కావ‌ట్లేదుగా..!

చైతూ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో సమంతతో ఉన్న ఫోటోలను కూడా డిలీట్‌ చేయలేదు. కాగా 2017, అక్టోబర్‌6న హిందూ, క్రిస్టియన్‌ పద్ధతిలో పెళ్లి చేసుకున్న చై-సామ్‌ గతేడాది అక్టోబర్‌2న విడిపోయిన సంగతి తెలిసిందే. సినిమాల విష‌యానికి వ‌స్తే స‌మంత వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. అందులో ఒక‌టి శాకుంత‌లం..ఇది పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. మ‌రో చిత్రం య‌శోద‌. ఈ మూవీ షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇది కాకుండా జాన్ పిలిప్ ద‌ర్శ‌క‌త్వంలో అరెంజ్‌మెంట్ ఆఫ్ ల‌వ్ అనే ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీలోనూ న‌టించ‌బోతుంది. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేస్తోంది. మ‌రోవైపు చైతూ సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో బిజీగా ఉన్నాడు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి