Home » Entertainment » Samantha Un Happy With Phone Ban
Entertainment

Samantha : అది న‌న్ను చాలా హ‌ర్ట్ చేసిందంటున్న స‌మంత‌..

Authored By
Sam C
The Telugu News | Published on: January 7, 2022, 8:10 pm
Advertisement

Samantha:అందాల ముద్దుగుమ్మ స‌మంత ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. స‌మంత చేసే పోస్ట్‌ల‌పై ప్ర‌తి ఒక్క‌రు దృష్టిసారిస్తున్నారు. ఒక్కోసారి ఆమె చేసే పోస్ట్‌లు అర్ధంకాక జుట్టు పీక్కుంటున్నారు నెటిజ‌న్స్.తాజాగా సామ్ ఒక ఆసక్తికరమైన వార్తపై స్పందించింది. జనవరి 4 నుంచి బ్లాక్ బెర్రీ ఫోన్స్ సర్వీసులని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. జనవరి నాలుగు నుంచి బ్లాక్ బెర్రీ ఓఎస్ లు పనిచేయడం లేదు. ఈ వార్త తెలియగానే సమంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

Advertisement

‘ఎందుకో తెలియదు.. ఈ వార్త నన్ను బాధిస్తోంది’ అంటూ సామ్ కామెంట్ పెట్టింది. ఈ విషయం నన్ను ఎందుకింత బాధించిందో తనకు తెలియదు అని ఇన్‌స్టాలో పేర్కొంది. సమంత మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్లాక్ బెర్రీ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా నిరాశని వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ బెర్రీ మొబైల్స్ తో తమకున్న మెమొరీస్ ని షేర్ చేసుకుంటున్నారు. మ‌రి స‌మంత‌కి బ్లాక్ బెర్రీతో అంత అనుబంధం ఉందా అంటూ కొంద‌రు స్ట‌న్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం మీరు ఏ ఫోన్ వాడుతున్నారు అంటూ మ‌రి కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

samantha un happy with phone ban

Advertisement

Samantha : స‌మంత ఎందుకు అంతగా ఫీల‌వుతుందో..!

ఇక సినిమాల విషయానికి వస్తే స‌మంత ఒక‌వైపు షికారులకి వెళుతూనే మ‌రోవైపు సినిమాల‌తో బిజీగా మారుతోంది.సమంత రీసెంట్ గా పుష్ప చిత్రంలో ఊ అంటావా ఊ ఊ అంటావా అంటూ ఐటెం సాంగ్ లో చిందులేసింది.ఈ సాంగ్‌కి వ‌చ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. రీసెంట్ గా ఈ సాంగ్‌కి ఎంతగా రిహార్స‌ల్ చేసిందో కూడా మ‌నం చూశాం. తాజాగా గే యశోద అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ తాజాగా పూర్తైన‌ట్టు తెలుస్తుంది. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’లో సామ్ నటించిన సంగతి తెలిసిందే. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి