Home » Entertainment » Samantha Wishes To Akhil Akkineni
Entertainment

Samantha : మరిదిపై సమంత కామెంట్లు.. విడాకుల అనంతరం మొదటిసారిగా

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: April 9, 2022, 1:08 pm
Advertisement

Samantha : సమంత తన అక్కినేని ట్యాగును తీసేసింది. ఇన్ స్టా ఐడీలో సమంత తన పేరుని మార్చుకోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. అక్కినేని పేరుని తీసేయడంతో విడాకుల రూమర్లు వచ్చాయి. మొత్తానికి అవే నిజమయ్యాయి. సమంత నాగ చైతన్య విడాకుల వ్యవహారం ఎంతటి హాట్ టాపిక్‌గా మారిందో అందరికీ తెలిసిందే.అసలు వారిద్దరి వ్యవహారం విడాకుల వరకు ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాకుండాపోయింది.మొత్తానికి సమంత మాత్రం ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీకి దూరంగా ఉంటోంది. దగ్గుబాటి ఫ్యామిలీకి మాత్రం సన్నిహితంగానే ఉంటోంది.

Advertisement

రానా, వెంకీ మామ కూతురు ఆశ్రిత, మిహికా బజాజ్ వంటి వారితో సమంత బాగానే ఉంటోంది. కానీ అక్కినేని వారితో మాత్రం సమంత దూరంగానే ఉంటోంది.అందరి బర్త్ డేలకు సమంత విషెస్ చెబుతూనే ఉంటుంది. కానీ నాగ చైతన్య బర్త్ డేకు మాత్రం స్పందించలేదు.మొన్నటికి మొన్న నాగ చైతన్య ఫోటోను సమంత మొదటిసారిగా షేర్ చేసింది. మజిలీ చిత్రానికి మూడేళ్లు నిండాయ్ అంటూ సమంత ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో నాగ చైతన్య పోస్టర్ హైలెట్ అయ్యింది.

Samantha Wishes To AKhil Akkineni

Advertisement

మొత్తానికి విడాకుల వ్యవహారం తరువాత మొదటి సారిగా నాగ చైతన్య ఫోటోను ఇలా షేర్ చేసింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు.అయితే అక్కినేని అఖిల్ బర్త్ డే సందర్భంగా సమంత ఓ పోస్ట్ వేసింది. మరిది కోసం సమంత ఇలా ముందుకు వచ్చింది. అఖిల్ మీద తన ప్రేమను కురిపించింది సమంత. హ్యాపీ బర్త్ డే అఖిల్.. ఈ ఏడాది నీకు అంతా మంచే జరగాలి.. నువ్ ఏదైతే కోరుకుంటావో.. అది నీకు దక్కాలని నేను ఆశిస్తున్నాను. ప్రార్థిస్తున్నాను.. గాడ్ బ్లెస్ అంటూ సమంత షేర్ చేసింది…

Samantha Wishes To AKhil Akkineni

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి