Home » Entertainment » Samantha With Ranveer Singh Happy Mood
Entertainment

Samantha : దీపికా ప‌దుకొణే భ‌ర్త‌తో స‌న్నిహితంగా స‌మంత‌.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రుగుతుంది?

Authored By
Sam C
The Telugu News | Published on: June 6, 2022, 7:00 pm
Advertisement

Samantha: టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ స‌మంత హ‌వా ఇటీవ‌లి కాలంలో మాములుగా లేదు. ఈ అమ్మ‌డు ఇన్నాళ్లు టాలీవుడ్ ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు పొంత‌గా, ఇప్పుడు బాలీవుడ్ హీరోల మెప్పు కూడా పొందుతుంది. ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో హోస్ట్‌ రణ్‌వీర్‌ సింగ్‌ను ‘తెలుగులో మీకు నచ్చిన పాట ఏది ?’ అని అడిగాడు. దీనికి అల్లు అర్జున్‌ హీరోగా చేసిన పాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప: ది రైజ్‌’లోని ‘ఊ అంటావా మావా’ అనే సాంగ్‌ ఇష్టమని తెలిపాడు రణ్‌వీర్. దీని గురించి రణ్‌వీర్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన పాట ఊ అంటావా మావా. ఆ సాంగ్ ప్లే అయినప్పుడు ఐయామ్‌ గోయింగ్‌ మ్యాడ్‌. ఆ పాట మీనింగ్‌ నాకు తెలియదు.

Advertisement

కానీ నా మనసుకు మాత్రం బాగా నచ్చింది. అందుకే ఆ పాటంటే అంత ఇష్టం నాకు. ‘అని పేర్కొన్నాడు. . ఇక తాజాగా ర‌ణ్‌వీర్‌- స‌మంత క‌లిసి న‌టించారు.ఓ యాడ్ కోసం ఈ ఇద్ద‌రు క‌ల‌వ‌గా, వారి పిక్ నెట్టింట చక్క‌ర్లు కొడుతుంది. స్వీటెస్ట్ ప‌ర్స‌న్ అంటూ స‌మంత అత‌నితో క్లోజ్ గా దిగిన ఫొటో షేర్ చేస్తూ పేర్కొంది. స‌మంత పిక్ ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. సమంత వివాహ బంధం నుంచి వేరుపడి ఒంటరి అయ్యాక కెరీర్ పై ఫోకస్ బాగా పెంచింది. ఫ్యామిలీ మ్యాన్‌ 2, పుష్ప తర్వాత హీరోయిన్‌ సమంత పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. సినిమాలతోనే కాకుండా తన వ్యక్తిగత విషయాలతోనూ సామ్‌ పేరు నిత్యం సోషల్‌ మీడియాలో ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంది.

samantha with ranveer singh happy mood

Advertisement

Samantha : స‌మంత సంద‌డి..

తాజాగా ఈ హీరోయిన్‌ గురించి మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అక్కినేని నాగచైతన్య కోసం సామ్‌ బాలీవుడ్‌ స్టార్‌ హీరోనే రిజెక్ట్‌ చేసిందంటూ ఓ వార్త ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ కోలీవుడ్‌ డైరెక్టర్‌ అట్లీ కాంబినేషన్‌లో జవాన్‌ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే కదా! ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించనున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే నయన్‌ కన్నా ముందు ఈ ఆఫర్‌ సమంతను వరించిందట. 2019లోనే అట్లీ ఈ స్క్రిప్ట్‌ను సామ్‌కు వినిపించాడట. కానీ చైతన్యతో కలిసి కుటుంబ జీవనాన్ని ఆస్వాదించాలనుకున్న సామ్‌ ఫ్యామిలీకి టైం కేటాయించడం కోసం ఈ సినిమాను సున్నితంగా తిరస్కరించిందని భోగట్టా

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి