samantha work hard for new look
Samantha : ఏ మాయ చేశావే చిత్రంతో అభిమానుల మనసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ సమంత. ఈ సినిమా సమంతకు చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఈ చిత్రంతోనే సమంత తెలుగు ప్రేక్షకుల ముందుకు రాగా, ఇటీవల 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అంటే సమంత సినీ జర్నీ కూడా మొదలై 12 ఏళ్లు అయింది. ‘ఫిల్మ్ ఇండస్ట్రీలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. ఈ రోజు ఉదయం నిద్ర లేవగానే… లైట్లు, కెమెరా, యాక్షన్ ఇలా సాటిలేని క్షణాల చుట్టూ తిరిగే 12 సంవత్సరాల జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. ఈ ఆశీర్వాద ప్రయాణాన్ని, ప్రపంచంలోనే అత్యుత్తమమైన, అత్యంత నమ్మకమైన అభిమానులను కలిగి ఉన్నందుకు కృతజ్ఞతతో రుణపడి ఉన్నాను. సినిమాతో నా ప్రేమ కథ ఎప్పటికీ ముగియదు’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది సమంత.
సమంత ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్‌లో ఒకరు కాగా, ఈ అమ్మడు పెళ్లైన తర్వాత కూడా తన స్థానాన్ని అలానే పదిలపరచుకుంది. విడాకుల తర్వాత కూడా సమంత వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ షాక్ ఇస్తుంది.అయితే తాను కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు తన ఫిట్‌నెస్ విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా ముందుకు పోతుంది. ఎంతటి కష్టతరమైన వ్యాయామం అయినా అవలీలగా చేస్తుంది సమంత. స్క్వాట్స్, ఏరోబిక్స్, యోగా, జిమ్, వెయిట్ లిఫ్టింగ్.. ఇలాంటివన్నీ చేస్తూ హెల్త్ ని బాగా మెయింటైన్ చేస్తుంది.
samantha work hard for new look
ఈ వీడియోలు షేర్ చేసేటప్పుడు అప్పుడప్పుడు తన ట్రైనర్ జునైద్ షేఖ్ గురించి కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. జునైద్ సమంత వర్కౌట్స్ చేసేటప్పుడు పక్కనే ఉండి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. సమంత అంత ఫిట్ గా ఉండటానికి జునైద్ కూడా కారణమే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జునైద్ సమంత గురించి ప్రస్తావించాడు.సమంత ఒకవేళ అథ్లెట్ అయితే విరాట్ కోహ్లీలా ఉండేది. నేను ఎంత కష్టమైన వ్యాయామం చెప్పినా సమంత మరొక్కసారి చెయ్యి నేను ప్రయత్నిస్తా అంటుంది కాని చెయ్యను అని ఎప్పుడూ చెప్పదు అని అన్నాడు. మరి వర్కవుట్ విషయంలో అంత పర్‌ఫెక్ట్‌గా ఉండే సమంత తాజాగా జిమ్‌లో తెగ వర్కవుట్స్ చేస్తుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
This website uses cookies.