samantha intresting tweet viral
Samantha : అందాల ముద్దుగుమ్మ సమంత గత కొద్ది రోజులుగా వరుస సినిమా షూటింగ్స్‌తో తెగ బిజీగా ఉంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నప్పటికీ, పెద్దగా ముచ్చటించలేదు. అయితే తాజాగా తన సినిమా ప్రమోషన్ లో భాగంగా నెటిజన్స్‌తో మాట్లాడింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పింది. థియేటర్‌లో చూసిన ఫస్ట్ మూవీ ఏదని ఓ నెటిజన్ అడగ్గా జురాసిక్ పార్క్ అని జవాబిచ్చింది సామ్. అలాగే తన తొలి సంపాదన గురించి మాట్లాడుతూ… హోటల్‌లో హోస్టెస్‌గా ఎనిమిది గంటలు పని చేసినందుకు రూ.500 ఇచ్చారని గుర్తు చేసుకుంది. అమ్మాయిల కోసం ఏదైనా స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వమని అడగ్గా..
మీపైన మీరు నమ్మకం పెట్టుకోండి. మీ కలలను సాకారం చేసుకునే దిశగా ప్రయత్నించండి అని సెలవిచ్చింది.కాగా గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న చైసామ్ గతేడాది అక్టోబర్‌లో విడిపోయిన విషయం తెలిసిందే. తెలుగులో కొంత కాలం గ్యాప్ తీసుకున్న సమంత ప్రస్తుతం గుణశేఖర్ తెరకెక్కిస్తోన్న ‘శాకుంతలం’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తోంది. ఇప్పటికే షూట్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు. దీనితో పాటు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తోన్న ‘కాతు వాకుల్ రెండు కాదల్’ అనే తమిళ చిత్రాన్ని కంప్లీట్ చేసేసుకుంది. స్టార్ హీరోయిన్ సమంత దేశ వ్యాప్తంగా ఫేమస్ అవడమే కాదు..
samantha works for 500 rupees
ఇప్పుడు హాలీవుడ్ రేంజ్‌కు కూడా తన ప్రస్థానాన్ని తీసుకు వెళ్తోంది.ఇందులో భాగంగానే BAFTA అవార్డు గ్రహీత ఫిలిప్ జాన్ తెరకెక్కించే ఈ వెబ్ ఫిల్మ్ ‘The arrangements of love’ నవల ఆధారంగా రూపొందనుంది. దీనితో పాటు ‘యశోద’ అనే లేడీ ఓరియెంటెడ్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. ఒకవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయిన సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా కాలంగా ఫుల్ బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా భారీ స్థాయిలో ఫాలోవర్లను పెంచుకుంటోంది. ఇప్పటికే సామ్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
This website uses cookies.