Home » Entertainment » Samantha Yashoda Bad Report From Censor
Entertainment

Samantha : అసలే కష్టాల్లో ఉన్న సమంత జీవితంలో మరొక దారుణమైన బ్యాడ్ న్యూస్ ..!

Authored By
Rame Samhith
The Telugu News | Published on: November 9, 2022, 5:50 pm
Advertisement

Samantha : ఓ పక్క మయోసైటిస్ తో బాధపడుతున్న సమంతకు వరుస షాకులు తగులుతున్నాయి. శుక్రవారం రిలీజ్ అవబోతున్న యశోద సినిమా నిన్న సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. సెన్సార్ నుంచి యు/ఏ సర్టిఫికెట్ అందుకున్న సమంత మరోపక్క స్వారి నుచి వచ్చిన టాక్ తో ఆలోచనలో పడ్డదట. సమంత యశోద సినిమాకు సెన్సార్ నుంచి నెగటివ్ టాక్ వచ్చినట్టు తెలుస్తుంది. సినిమాకు ఎంచుకున్న కథ బాగున్నా సినిమా మొత్తం సమంత మాత్రమే కనిపించే సరికి కొద్దిగా బోర్ కొట్టేసిందని అన్నారట. అంతేకాదు తీసుకున్న కథకి సరైన న్యాయం చేయలేదని టాక్ వచ్చింది.

Advertisement

సమంతతో పాటుగా ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, మళయాళ స్టార్ ఉన్ని ముకుందన్ నటించారు. యశోద సినిమాను హరి హరీష్ ఇద్దరు దర్శకులు డైరెక్ట్ చేశారు. శ్రీదేవి సినిమాస్ బ్యానర్ లో శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా విషయంలో సమంత చాలా రిస్క్ తీసుకుందని తెలుస్తుంది. ఆమెకు ఓ పక్క వ్యాధి ఉన్నా సరే సమంత అవేవి లెక్క చేయకుండా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నదట. సినిమాలో సమంత యాక్షన్ సీన్స్ లో కూడా బాగానే చేసిందని అంటున్నారు.

samantha yashoda bad report from censor

Advertisement

అయితే సెన్సార్ నుంచి వచ్చిన టాక్ ఎలా ఉన్నా సమంత ఫ్యాన్స్ మాత్రం యశోద సూపర్ హిట్ పక్కా అని అంటున్నారు. సరోగసీ మాఫియా కథతో వస్తున్న యశోద సినిమా విషయంలో సమంత చాలా కాన్ ఫిడెంట్ గా ఉంది. మరి సమంత కోరుకున్నట్టుగానే సినిమా సూపర్ హిట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. సమంత నటించిన ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు యూ టర్న్, ఓ బేబీ ఈవరకు సక్సెస్ అయ్యాయి. అందుకే ఆ క్రమంలోనే సమంత యశోద కూడా హిట్ కొడుతుందనే ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సినిమాని పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. సమంత స్టామినా చూపించేలా ఈ సినిమా సూపర్ హిట్ కొడితే ఈ టైం లో సమంత సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతుంది.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి