Home » Entertainment » Samntha Post Viral Now
Entertainment

Samantha : ప్రీత‌మ్‌కి స‌మంత ఐల‌వ్‌యూ చెప్ప‌డమేంది, దానికి తిరిగి ఐల‌వ్ యూ అన‌డ‌మేంది?

Authored By
Sam C
The Telugu News | Published on: May 6, 2022, 9:00 pm
Advertisement

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో స‌మంత ఒక‌రు. చూడ‌చక్క‌ని అందంతో కొన్ని ద‌శాబ్ధాలుగా అల‌రిస్తూ వ‌స్తున్న స‌మంత నిత్యం వివాదాల‌తో హాట్ టాపిక్‌గా మారుతుంది. చివ‌రిగా స‌మంత కాతువాకుల రెండు కాద‌ల్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది.ఈ మూవీలో విజయ్ సేతుపతి లవర్స్ గా నయనతార, సమంత నటించారు. గత వారం విడుదలైన ఈ సినిమా తమిళంలో మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో సమంత ఖతీజా అనే పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ సినిమా గురించి సమంత ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ ఖతీజా పాత్రలో అద్భుతంగా నటించే ఛాన్స్ ఇచ్చినందుకు విఘ్నేష్ శివన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

కాతువాకుల రెండు కాదల్ మూవీతో కామెడీ జోన‌ర్‌లో న‌టించే కోరిక తీరినట్లు వెల్లడించారు. ఆ తర్వాత సమంత ప్రీతమ్ జుకల్కర్ తో పాటు మరి కొందరిని ట్యాగ్ చేస్తూ లవ్ సింబల్స్ పెట్టారు.సమంత ట్యాగ్ చేయడంతో ప్రీతమ్ జుకల్క‌ర్ అయితే సమంతను అతడు జిజి అని సంబోధించడం తో మరోమారు వాళ్ళ రిలేషన్ పై క్లారిటీ ఇచ్చారు. హిందీలో సిస్టర్ ని జిజి అని కూడా పిలుస్తారు. కాబట్టి అతడు ఐ లవ్ యూ అక్క అని చెప్పాడన్న మాట. మరోవైపు ప్రీతమ్ గే, అతడు సమంతతో ఎఫైర్ పెట్టుకొనే అవకాశమే లేదంటూ ఓ వాదన ఉంది.

samntha post viral now

Advertisement

Samantha : స‌మంత ఇన్ న్యూస్..

చైసామ్ విడాకుల మ్యాటర్‌పై ఎన్నో రకాల రూమర్లు పుట్టుకొచ్చాయి. అందులోంచి ఓ దారుణమైన రూమర్ సమంత డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ గురించి వచ్చింది. సమంత స్టైలిష్ట్ ప్రీతమ్ గురించి చాలా మందికి తెలిసిందే. ఈ ఇద్దరి సాన్నిహిత్యాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. ప్రీతమ్ ఒళ్లో సమంత కాలుపెట్టిన దిగిన ఓ ఫోటో ఎంతటి కాంట్రవర్సీకి దారి తీసిందో తెలిసిందే. ఆ ఘటన నుంచే ప్రీతమ్ ఎక్కువగా వెలుగులోకి వచ్చాడు. అయితే ఈప్రీతమ్ సమంతను జీజీ అన పిలుస్తాడు. అంటే అక్కా అని అర్థం. అయిన‌ప్ప‌టికీ ఇద్ద‌రి మ‌ధ్య ఏదో అర్ధం ఉంద‌నే ప్ర‌చారం న‌డిచింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి