Home » Entertainment » Sandeep Power Ashtra Missing In Bigg Boss Telugu 7 House
Entertainment

Bigg Boss Telugu 7 : పవర్ అస్త్ర పోగొట్టుకున్న ఆట సందీప్.. తన ఇమ్యూనిటీ మొత్తం పోయింది.. నామినేషన్లలోకి వెళ్లినట్టేనా?

Authored By
Breaking News 2
The Telugu News | Published on: September 14, 2023, 11:00 am
Advertisement

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ తెలుగు హౌస్ లో ఏం జరుగుతోంది. అంతా కన్ఫ్యూజన్ గా ఉంది ప్రేక్షకులకు. ఎందుకంటే.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు బిగ్ బాస్ ఏం చెబితే అది చేయాలి. కానీ.. బిగ్ బాస్ చెప్పింది పక్కన పెట్టి తమకు నచ్చింది చేసుకుంటూ వెళ్తున్నారు కంటెస్టెంట్లు. నిన్న బిగ్ బాస్ అందరికీ ఒక టాస్క్ ఇచ్చారు. టీమ్ మహాబలి వర్సెస్ రణధీర అనే టాస్క్ ను బిగ్ బాస్ ఇచ్చాడు. మాయాస్త్రం గురించి ఒక పెద్ద స్టోరీ చెప్పాడు బిగ్ బాస్. అది ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉందని.. అది దొరికినా కూడా దాన్ని ఓపెన్ చేయాలంటే దానికి ఒక కీ అవసరం అని కీ కోసం బిగ్ బాస్ ఒక పోటీ పెడతాడు. ఆ పోటీలో గెలిచిన వాళ్లకు కీ ఇస్తా అంటాడు బిగ్ బాస్. దీంతో శివాజీ టీమ్ కీను గెలుచుకుంటుంది. ఇక.. మాయాస్త్రం కోసం రెండో పోటీ జరిగింది.

Advertisement

అయితే.. ఆ కీని శివాజీ టీమ్ దగ్గర్నుంచి లాక్కోవడానికి వేరే టీమ్ ప్రయత్నిస్తూ ఉంటుంది. శివాజీ టీమ్ మాత్రం దాన్ని దొరక్కుండా ప్రయత్నిస్తుంటారు. ఇదంతా పక్కన పెడితే హౌస్ లో పవర్ అస్త్రను సంపాదించిన తొలి కంటెస్టెంట్ గా సందీప్ రికార్డు క్రియేట్ చేశాడు. అంతే కాదు.. 5 వారాల ఇమ్యూనిటీ గెలుచుకొని తొలి ఇంటి సభ్యుడిగా నిలుస్తాడు సందీప్. కానీ.. సందీప్ పవర్ అస్త్రను కొట్టేయడానికి తెగ ప్రయత్నాలు చేస్తారు. చివరకు సందీప్ పవర్ అస్త్రను దొంగలిస్తారు.

Bigg Boss Telugu 7 : అంత చీప్ మైండెడ్ గా ఉన్నారా అంటూ సందీప్ సీరియస్

తన పవర్ అస్త్ర కనిపించకపోవడంతో సందీప్ ఒక్కసారిగా డీలా పడిపోతాడు. తన పవర్ అస్త్రను ఎవరు తీశారని సీరియస్ అవుతాడు. ఎవరిని అడిగినా చెప్పరు. అంత చీప్ మైండెడ్ గా ఉంటే ఎలా అంటూ ప్రశ్నిస్తాడు సందీప్. మీరు చీప్, గీప్ అంటూ మాటలు మాట్లాడకండి అంటూ సందీప్ మీద తేజ సీరియస్ అవుతాడు. మరి అది కరెక్ట్ కాదు కదా అంటాడు సందీప్. పవర్ అస్త్ర కోసం సందీప్ మొత్తం వెతుకుతాడు కానీ కనిపించదు. తనకు అమరదీప్ సాయం చేస్తాడు. ఇల్లు మొత్తం వెతుకుతారు కానీ కనిపించదు. నా రూమ్ లోకి పర్మిషన్ లేకుండా రావడమే కరెక్ట్ కాదు. నా రూమ్ లోకి వచ్చి ఇలా పవర్ అస్త్రను ఎలా దొంగలిస్తారు అంటూ ఆట సందీప్ కెమెరాకు చెప్పుకొని ఏడుస్తాడు. ఒకవేళ పవర్ అస్త్ర సందీప్ దగ్గర లేకపోతే ఆయనకు ఉన్న పవర్స్ అన్నీ పోతాయి. చివరకు నామినేషన్స్ లోకి కూడా వెళ్తాడు.

Advertisement

మాయాస్త్ర కోసం రెండో పోటీ జరుగుతుండగానే శుభశ్రీ మెల్లగా మాస్టర్ రూమ్ లోకి వెళ్లి పవర్ అస్త్రను దొంగలిస్తుంది. ఆ విషయం ఒక్క టేస్టీ తేజ, రతిక, శుభశ్రీకి తప్పితే ఇంకెవరికీ తెలియదు. మరి దీనిపై బిగ్ బాస్ ఏమంటాడో వేచి చూడాల్సిందే.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి