Home » Entertainment » Sarayu In Bigg Boss 5 Telugu Buzz
Entertainment

Sarayu : మ్యాటరే లేదు.. యాంకర్ రవి పరువుతీసిన సరయు.. వీడియో

Authored By
Cinema Desk
The Telugu News | Published on: September 13, 2021, 3:15 pm
Advertisement

Bigg Boss 5 Telugu బిగ్ బాస్ 5 తెలుగు Bigg Boss 5 Telugu ఇంట్లో సరయు కాలం చెల్లింది. వారాంతంలో ఎలిమినేషన్ అయిపోయింది. సరయు ఎలిమినేట్ అయి స్టేజ్ మీదకు వచ్చిన తరువాత కొందరిని కడిగిపారేసింది. ఐదుగురు బెస్ట్, వరెస్ట్ కంటెస్టెంట్ల గురించి చెప్పమని నాగార్జున ఓ టాస్క్ ఇచ్చాడు. అందులో వరెస్ట్ కంటెస్టెంట్ల గురించి చెబుతూ.. సన్నీ, సిరి, షన్ను, ఆర్జే కాజల్, లహరి గురించిచెప్పింది. ఒక్కొక్కరిని దారుణంగా తిట్టింది. సరయు ఊగిపోయిన రేంజ్ చూస్తే.. ఈ ఫైర్ ఇంట్లో చూపిస్తే వేరేలా ఉండేది.

Advertisement

Sarayu In Bigg Boss 5 Buzz

అయితే బిగ్ బాస్ 5 తెలుగు Bigg Boss 5 Telugu బజ్‌లో అయితే సరయు ఇంకోలా రెచ్చిపోయినట్టుంది. అరియానా హోస్ట్‌గా వస్తోన్న ఈ షోలో సరయు దుమ్ములేపేసింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు మొదటగా ఈ షోలో మాట్లాడాల్సి ఉంటుంది. అలా సరయు ఒక్కొక్క కంటెస్టెంట్ ఏకిపారేసింది. తన యూట్యూబ్ చానెల్ వీడియాల్లో ఎలా మాట్లాడుతుందో అందరికీ తెలిసిందే. ఇక తాజాగా వదిలిన ప్రోమోలో అయితే ఒక్కోక్క కంటెస్టెంట్ మీద తనకున్న అభిప్రాయాన్ని చెప్పింది.

Advertisement

 

siri in tears when sarayu in Bigg Boss 5 Telugu

Advertisement

మ్యాటరే లేదు.. యాంకర్ రవి పరువుతీసిన సరయు Bigg Boss 5 Telugu

ఇంట్లో ఉన్న ఒకే ఒక్క మొగోడు విశ్వ అని చెప్పేసింది. ఎలుకలే గుంపులు గుంపులుగా వస్తాయ్.. సింహం సింగిల్‌గా ఉంటుంది.. యాంకర్ రవి అందరికీ సూక్తులు చెబుతూ మంచోడిలా నటిస్తున్నాడు. కానీ మ్యాటర్ లేదు.. సన్నీ వేస్ట్.. ఓ మొగోడు మన పక్కన ఉంటే పని అయిపోతది అని అనుకునే రకం అది అంటూ ఒక్కొక్కరి గురించి సరయు దారుణంగా మాట్లాడింది. ఇక అసలు సరయు ఇంటి సభ్యుల గురించి మాట్లాడిన మాటలు తెలియాలంటే ఆ ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వేచి చూడాలి.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి