
Sarkaru vari pata : సర్కరు వారి పాట.. సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం. మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్, బ్యానర్స్ తో పాటు మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. వరస హిట్స్‌తో మంచి ఫాంలో ఉన్న మహేష్ కెరీర్‌లో తెరకెక్కుతున్న 27వ సినిమా సర్కారు వారి పాట ఇప్పటికే దుబాయ్‌లో నెల రోజుల భారీ షెడ్యూల్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే.
sarkaru-vari-pata-is nothing says thaman…!
కాగా సర్కారు వారి పాట చిత్ర బృందం ఆ తర్వాత గోవాలో అలాగే మళ్ళీ దుబాయ్‌లో షూటింగ్ ప్లాన్ చేశారట. దుబాయ్‌లోనే మరో నెల రోజుల షెడ్యూల్ కంప్లీట్ చేయాలని సన్నాహాలు చేసినప్పటికి కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా పెరుగుతుండటంతో సర్కారు వారి పాట బృందం దుబాయ్ షెడ్యూల్ క్యాన్సిల్ చేసినట్టు తాజా సమాచారం. అయితే హైదరాబాద్‌లో వచ్చే వారం నుంచి 25 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసిన సర్కారు వారి పాట బృందం తాజాగా ఈ షెడ్యూల్ కూడా క్యాన్సిల్ చేశారట. పరిస్థితులు చక్కబడితే సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తారని లేటెస్ట్ అప్‌డేట్.
కాగా వరస హిట్స్‌తో మంచి ఫాంలో ఉన్న థమన్ తాజాగా వచ్చిన వకీల్ సాబ్ సినిమాతో మరో లెవల్‌కి చేరుకున్నాడు. ఈ క్రమంలో థమన్ సర్కారు వారి పాట సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలను బయట పెట్టాడు. ఈ సినిమాలో మొత్తం 5 పాటలు ఉన్నాయని… ఇప్పటికే మూడు పాటలు కంప్లీట్ చేశానని.. త్వరలో మరో రెండు పాటలను కంప్లీట్ చేస్తానని చెప్పుకొచ్చాడు. సర్కార్ ఆల్బమ్ దాదాపుగా మాస్ అండ్ ఎనర్జిటిక్ సాంగ్స్ తో ఉండబోతుందని తెలిపాడు. అయితే సినిమా రిలీజ్ కి ఇంకా చాలా నెలలు ఉండగా ఈ సినిమాలో ఎన్ని పాటలున్నాయో హింట్ ఇవ్వడం ఏంటన్న విషయంలో ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయట. ఏదేమైనా ఇప్పుడు థమన్ హవా నడుస్తోంది. ఇక థమన్ ఇప్పటికే మహేష్ బాబుకి హ్యాట్రిక్ హిట్స్ ఇవ్వగా సర్కారు వారి పాటతో కంపేర్ చేస్తే అవి నథింగ్ అంటున్నాడట.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.