Home » Entertainment » Satya Dev Gives Shock To Netizens By Sharing His Son Pic
Entertainment

Satya Dev : హా షాక్ అయ్యారా?.. సత్య దేవ కొడుకు ఫోటోపై నెటిజన్ల రియాక్షన్

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: February 9, 2021 6:55 pm
Advertisement

Satya Dev : కొందరి విషయంలో కొన్ని నిజంగానే షాకింగ్‌గా ఉంటాయి. కొందరు హీరోలు తమ పర్సనల్ విషయాలను ఎప్పుడూ పబ్లిక్‌గానే ఉంచుతారు. కొందరు మాత్రం తమ వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా నోరు విప్పరు. అలాంటి వారిలో సత్యదేవ్ ఒకడు. అసలు ఆ హీరోకు పెళ్లి అయిందని, ఓ కొడుకు కూడా ఉన్నాడని ఎవ్వరికీ తెలియదు. సడెన్ నిన్న ఓఫోటోను షేర్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు.

Advertisement

Satya Dev gives shock to netizens by sharing His son pic

సావర్ణిక్ ఈరోజుతో ఏడాది పూర్తిచేసుకున్నాడు. ఇడుగో మా జూనియర్. వాడిపై ఎప్పుడూ మీ ప్రేమ, ఆశీస్సులు ఉండాలి అని తన కొడుకు, భార్యతో దిగిన ఫోటోను సత్యదేవ్ షేర్ చేశాడు.అయితే దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. సెలెబ్రిటీలకు ఆ విషయం తెలుసు కాబట్టి సాధారణంగా స్పందిస్తున్నారు. కానీ బయట అభిమానులకు , సాధారణ ప్రేక్షకులకు మాత్రం పెళ్లయిందన్న విషయం తెలియదు.

Advertisement

సత్య దేవ కొడుకు ఫోటోపై నెటిజన్ల రియాక్షన్

దీంతో కొందరు హా షాక్ అయ్యారా? అంటూ లక్ష్మీ సినిమాలో వేణు మాధవ్‌లా రియాక్ట్ అవుతున్నారు. ఏంటి, అన్నకు పెళ్లయి పిల్లోడు కూడా ఉన్నాడా.. అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది అంటూ తలలు గోక్కుంటున్నారు. మొత్తానికి సత్యదేవ్ మాత్రం అందరినీ ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేశాడు. ‘గుర్తుందా శీతాకాలం’, ‘తిమ్మరుసు’ వంటి చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి