Pooja hegde : ఒకే ఏడాది ముకుందా, ఒక లైలా కోసం సినిమాలోతో గ్రాండ్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. ఈ రెండు సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. అదే సమయంలో బాలీవుడ్ లో ఆఫర్ వస్తే అక్కడ హృతిక్ రోషన్ తో మొహంజాదారో సినిమా చేసి భారీ ఫ్లాప్ మూటగట్టుకుంది. అయినా మళ్ళీ టాలివుడ్ లో దువ్వాడ జగన్నాథం సినిమాలో అవకాశం అందుకొంది. ఈ సినిమా కూడా చెప్పుకోవాల్సిన సక్సెస్ సాధించలేదు. అయినా పూజా ని టాలీవుడ్ మేకర్స్ బాగా ఎంకరేజ్ చేశారు. మహర్షి, అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలతో వరుసగా హిట్స్ అందుకొని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది.
పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే ప్రభాస్ తో చేస్తున్న రాధే శ్యాం, అఖిల్ తో చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలు పూర్తి చేసింది. అలాగే త్రివిక్రం శ్రీనివాస్ – మహేష్ బాబు ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసింది. ఇలా చేతినిండా సినిమాలతో క్షణం తీరికలేకుండా గడుపుతోంది ఈ పొడుగు కాళ్ల సుందరి. ఇలా తెలుగు తెరపై రాణిస్తూనే బాలీవుడ్ ఆఫర్స్ దక్కించుకుంది. అంతేకాదు కోలీవుడ్ లో విజయ్ 65వ సినిమాలో పూజా హీరోయిన్. సన్ పిక్చర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.
అయితే ప్రస్తుతం పూజా హెగ్డే వ్యవహరిస్తున్న తీరుతో భారీగా ప్రొడక్షన్ ఖర్చు పెరగడమే గాక, నిర్మాతలకు భారంగా మారుతోందంటూ ఆర్కే సెల్వమణి ఓ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. ఈ సమయంలో పూజా హెగ్డేపై రోజా భర్త, కోలీవుడ్ సినీ ఫెడరేషన్ యూనియన్ చైర్మన్ ఆర్కే సెల్వమణి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. గతంలో ఇద్దరు అసిస్టెంట్స్ మాత్రమే వెంట తీసుకొచ్చుకునే పూజా హెగ్డే ఇప్పుడు దాదాపు 12 మందిని తీసుకొస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. వీరి ఖర్చు మొత్తం నిర్మాతల మీదే వేస్తుందట. ఎంత స్టార్ హీరోయిన్ అయితే మాత్రం ఇలా 10 – 12 మందిని ఎవరూ వెంటబెట్టుకొని రావడం కరెక్ట్ కాదని వ్యాఖ్యలు చేశారు. దీనిపై పూజా ఎలా స్పందిస్తుందో చూడాలి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.