Home » Entertainment » Shabina K To Naresh In Extra Jabardasth
Entertainment

Jabardasth Naresh : గొలుసు ఇచ్చిన నరేష్, ముద్దు పెట్టిన షబీనా.. ముదిరిన వ్యవహారం

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: February 9, 2022 1:13 pm
Advertisement

Jabardasth Naresh : బుల్లితెరపై ప్రేమ కథలను నడిపించడం, తద్వారా టీఆర్పీ రేటింగ్‌లను రాబట్టడం అనేది కామన్ అయింది. రష్మీ సుధీర్ జోడిని అలానే సాగదీశారు. గత తొమ్మిదేళ్లుగా ఈ జోడి అలరిస్తూనే ఉంది. ఇంకా మున్ముందు కూడా చేస్తూనే ఉంటుంది.అయితే ఇప్పుడు కొత్త జంటలు కూడా వచ్చేశాయి. ఇంకా కొత్త కొత్త ట్రాకులు పుట్టుకొస్తున్నాయ్. అందులో నరేష్ షబినా ట్రాక్ ఒకటి.

Advertisement

షబినా ఈ మధ్య జబర్దస్త్ షోలో రెగ్యులర్ ఆర్టిస్ట్ అయిపోయింది. కస్తూరీ సీరియల్లో కనిపించే షబినా ఇప్పుడు జబర్దస్త్ నటిగా మారిపోయింది. ఒకప్పుడు కెవ్వు కార్తీక్ టీంలోనే ఉండేది. కార్తీక్ షబినా ట్రాక్ కొన్ని రోజులు నడిపించారు. కానీ మధ్యలో నరేష్ చాలా ఇంట్రెస్ట్ చూపించాడు. షబినా మీద ఉన్న కోరికలను, ప్రేమలను డైలాగ్స్, స్కిట్స్ రూపంలో చూపించేవాడు.

Shabina K To Naresh In Extra Jabardasth

Advertisement

Jabardasth Naresh : నరేష్‌కు షబినా ముద్దు..

ఇక రోజా కూడా ఈ ట్రాక్‌ను బాగానే ఎంకరేజ్ చేసింది. ఇక ఇప్పుడు వాలెంటైన్స్ డేస్పెషల్‌గా మరింతగా రెచ్చగొట్టేసింది. ఏం గిఫ్ట్ ఇస్తావ్ అంటూ నరేష్‌ను అంత ఎత్తుకు లేపేసింది. దీంతో నరేష్ ఏకంగా తన మెడలోని గొలుసుని తీసిచ్చాడు. తన తొడ మీద షబినాను కూర్చోబెట్టుకున్నాడు. మొత్తానికి షబినా కూడా ముద్దు పెట్టడంతో నరేష్ గాల్లోకి ఎగిరాడు. మొత్తానికి ఈ ఇద్దరి వ్యవహారం బాగానే ముదిరింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి