శాకుంతలం .. టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందబోతున్న లేటెస్ట్ సినిమా. మహాభారతంలోని ఓ అద్భుత ఘట్టం ఆధారంగా ఈ సినిమాని గుణ శేఖర్ తెరకెక్కించబోతున్నాడు. గుణ టీం వర్క్ అన్న సొంత బ్యానర్ లో దర్శకుడు గుణ శేఖర్ – ఆయన సతీమణి నీలిమ గుణ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో శాకుంతలం గా నటిస్తున్న హీరోయిన్ విషయంలో పలు పేరు వినిపించాయి. రుద్రమదేవి సినిమాలో నటించిన అనుష్క శెట్టి తోపాటు కీర్తి సురేష్, పూజా హెగ్డే లతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె పేరు వినిపించాయి. అలాగే కొత్త అమ్మాయిని శాకుంతలంగా తీసుకుంటున్నట్టు కూడా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
అయితే ఈరోజు ఉదయం గుణ సేఖర్ టీం ఈ సినిమా నుంచి భారీ సర్ప్రైజ్ రాబోతుందని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దాంతో అందరూ ఈ సినిమాలో నటించే హీరోయిన్ నే పరిచయం చేయబోతున్నారని ఆతృతగా ఎదురు చూశారు. అందరు అనుకున్నట్టుగానే న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాలో సమంత అక్కినేని శాకుంతలంగా నటించబోతున్నట్టు గుణశేఖర్ టీం అధికారకంగా ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమా నుంచి మోషన్ టీజర్ ని రిలీజ్ చేసి అక్కినేని ఫ్యాన్స్ కి భారీ సర్‌ప్రైజ్ ఇచ్చారు.
ఇక గత కొన్ని నెలలుగా సమంత నటించే నెక్స్ట్ సినిమా ఎంటన్నది ఇండస్ట్రీ తో పాటు ఫ్యాన్స్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. జాను డిజాస్టర్ తర్వాత మళ్ళీ సమంత ఏ తెలుగు సినిమాని ప్రకటించలేదు. దాంతో గుణ శేఖర్ శాకుంతలంగా నటిస్తున్న సమంత తాజా చిత్రం మీద భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇక సమంత డెబ్యూ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మాన్ 2 త్వరలో అమెజాన్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.