shanmukh and siri bigg boss5 Telugu viral in social media
Shanmukh స్టార్ మా లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు వచ్చేసింది. షోలో ప్రతిష్టాత్మకమైన ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. మొదటగా ఫస్ట్ టాస్క్‌లో ఐస్ టబ్‌లో పాల్గొన్న ఇంటి సభ్యులు చివరి వరకు పోరాడి తీవ్రంగా గాయ పడ్డారు. అనంతరం సెకండ్ టాస్క్‌లో భాగంగా ఏకాగ్రతగా కూర్చొని 29 నిమిషాలు లెక్కపెట్టాల్సిన టాస్క్ లో మానస్ విజేతగా నిలిచాడు. మూడు ఛాలెంజ్‌లు పూర్తయ్యే సరికి సన్నీ గెలిచి తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించాడు.టాస్క్ ల సంగతి కాసేపు పక్కన పెడితే షో లో రోజు రోజుకూ షన్ను, సిరి హనుమంతుల రొమాన్స్ శృతి మించుతోంది. ఎవరేం అనుకున్నా తమకేమీ పట్టనట్టు హగ్గుల విషయంలో ఏమాత్రం తగ్గకుండా రెచ్చి పోతున్నారు.
గత వారం ఫ్యామిలీ మీట్ లో హౌస్ ను విసిట్ చేసిన సిరి తల్లి… ఏకంగా వారివురి మధ్య బంధం తనకు నచ్చడం లేదంటూ ముఖం పైనే చెప్పేసింది. మరోవైపు షన్ను మదర్ కూడా ఎవరికి వారు లిమిట్స్‌లో ఉంటూ ఆడాలని హెచ్చరిస్తూ గట్టిగా క్లాస్ పీకింది. సిరి కాబోయే భర్త శ్రీహన్ ఏకంగా ‘ సిరి.. నన్ను వదిలేస్తున్నావా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. షన్ను లవర్ దీప్తి సునయన అయితే సిరి మీద కోపాన్ని ఇన్ డైరెక్ట్ గా చూపిస్తూ ఆమె పేరును కనీసం టాప్ – 5 లో కూడా పెట్టలేదు. హౌస్ సభ్యులతో పాటు, బయట వాళ్ల నుంచి కూడా వీరిద్దరి రిలేషన్ కు వ్యతిరేకంగా ఇన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నా వీరు మాత్రం వారి రొమాన్స్ ను ఏమాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తున్నారు.
shanmukh and siri bigg boss5 Telugu viral in social media
గత రాత్రి ప్రసారమైన ఏపిసొడ్ లో ‘షణ్ముఖ్ నన్ను బాగా చూసుకుంటున్నాడు, మరి హగ్గివ్వకపోతే ఎలా అంటూ సిరి అతడిని మరోసారి హత్తుకోవడం కొసమెరుపు. అయితే సోషల్ మీడియాలో వీరిద్దరి యవ్వారంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ అంతా కలిసి చూస్తున్న షో లో ఈ దరిద్రం ఏమిటంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. అయినవారు హెచ్చరించినా సిరి – షన్నులకు బుద్ది రాలేదంటూ మండిపడుతున్నారు. ఓట్ల కోసమే సిరి షన్ను కలిసి హాగ్గులతో రొమాన్స్ పండిస్తోందని ఆమెపై విరుచుకు పడుతున్నారు.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.