Shanmukh : గుట్టురట్టు చేసింది.. షణ్ముఖ్‌పై దీప్తి సునయన కామెంట్స్
Shanmukh : దీప్తి సునయన షణ్ముఖ్ జోడిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తుంటాయి. బిగ్ బాస్ షోలో దీప్తి సునయన పదే పదే షణ్ముఖ్ పేరు తీయడంతో అతను ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. దీప్తి సునయన బాయ్ ఫ్రెండ్‌గా మొదట్లో షణ్ముఖ్‌కు ఓ గుర్తింపు ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం షణ్ముఖ్‌కే తనకంటూ ఓ గుర్తింపు వచ్చింది. షణ్ముఖ్ అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ బ్రాండ్. మరీ ముఖ్యంగా యూట్యూబ్ స్టార్.
Shanmukh Deepthi Sunaiana love story
అలాంటి షణ్ముఖ్ ఇప్పుడు బుల్లితెరపైనా రచ్చ చేస్తున్నాడు. లాక్డౌన్‌లో షణ్ముఖ్ తీసిన స్టాఫ్ వేర్ డెవలవపర్ వెబ్ సిరీస్ బాగా క్లిక్ అయింది. సోషల్ మీడియాలో అది విపరతీంగా ఆదరణను సొంతం చేసుకుంది. అలా షణ్ముఖ్ ఇప్పుడు దీప్తి సునయన కంటే ఎక్కువగా క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఈ ఇద్దరూ కలిసి తాజాగా ఓ షోలో పాల్గొన్నారు. స్టార్ మాలో 100 పర్సెంట్ లవ్ అనే షోలో ఇద్దరూ రచ్చ చేస్తున్నారు.
Shanmukh : షణ్ముఖ్‌పై దీప్తి సునయన కామెంట్స్
రియల్ జంటలు, రీల్ జంటలు అంటూ పోటీలు పెట్టారు. అందులో ఈ ఇద్దరూ కూడా పాల్గొన్నారు.అయితే బుట్టబొమ్మ అనే పాటకు క్యూట్‌గా స్టెప్పులు వేశారు దీప్తి సునయన షణ్ముఖ్. ఇంత వరకు ప్రపోజ్ చేయాలని అనిపించలేదని షణ్ముఖ్ అనడం.. ఎందుకు అనిపించలేదని దీప్తి సునయన ఫైర్ అవ్వడం అందరినీ ఆకట్టుకుంటోంది. షణ్ముఖ్ ఇచ్చిన 21 బహుమతుల్లో ప్రేమ గురించే ఉందని చెప్పడంతో గుట్టు బయటపడింది.
