Bigg Boss 5 Telugu : ఏం చేత కాదని చెప్పేశారా?.. షన్ను పరువుతీసిన బిగ్ బాస్ టీం
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో షన్నుది వింత జర్నీ. ఉన్నాడా? అంటే ఉన్నాడు లేడా? అంటే లేడు అనే కంటెస్టెంటుగా మారిపోయాడు. షన్ను ఏం ఆడినా ఆడకపోయినా కూడా ఓట్లు మాత్రం భారీగానే వస్తుంటాయి. షన్నును అలా సోషల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తోంది. షన్నుకే అత్యధిక ఓట్లు వస్తున్నాయని తెలుస్తోంది. అసలే బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్‌లతో షన్ను దూసుకుపోయాడు. లాక్డౌన్ సమయంలో షన్ను ఇమేజ్ దారుణంగా పెరిగిపోయింది.
Shanmukh Jaswanth Trolls In Bigg Boss 5 Telugu
అయితే షన్ను మాత్రం బిగ్ బాస్ షోకు రావాలా? వద్దా? అని కూడా ఎంతో ఆలోచించాడు. చివరి నిమిషంలో వచ్చాడు. తాగి కారు నడిపి, పోలీసులకు చిక్కిన ఘటన ఓ మచ్చలా మారింది. దాన్నుంచి బయటకు వచ్చి, ఇమేజ్ మార్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ ఇంట్లో షన్ను చేసేది మాత్రం ఏమీ లేదు. యాపిల్స్ తింటూ, మోజ్ రూంలో కూర్చుని సిరి, జెస్సీలతో ముచ్చట్లు పెట్టడం తప్పా ఇంకేం చేయడం లేదు.
Bigg Boss 5 Telugu : షన్నుపై బిగ్ బాస్ టీం స్పెషల్ వీడియో
Shanmukh Jaswanth Trolls In Bigg Boss 5 Telugu
అలా అని బిగ్ బాస్ టీమే చూపించింది. నిన్నటి ఎపిసోడ్‌లో షన్నును ట్రోల్ చేస్తూ ఓ వీడియోను బిగ్ బాస్ టీం ప్లే చేసింది. అందులో షన్ను యాపిల్స్ తింటూ ఉండటం, టాస్క్ ఓ వైపు జరిగి అందరూ కొట్లాడుకుంటూ ఉంటే షన్ను మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ అలా ఉన్నాడు. సిరి, షన్నుల అలకలు, బుజ్జగింపుల ఎపిసోడ్ కూడా చూపించారు. మొత్తానికి షన్ను బిగ్ బాస్ ఇంట్లో ఏం చేయడం లేదు. ఏం చేతకాదు అని ఇలా పరోక్షంగా చెప్పినట్టు అయింది.
