Home » Entertainment » Shanmukh Shares A Selfie With Her
Entertainment

Shanmukh : ఆమెతో ముసిముసి న‌వ్వులు న‌వ్వుతూ దిగిన ఫొటో షేర్ చేసిన ష‌ణ్ముఖ్‌.. పాత రోజులు గుర్తు చేస్తూ..

Authored By
Sam C
The Telugu News | Published on: February 28, 2022, 10:00 am
Advertisement

Shanmukh : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బిగ్ బాస్ సీజన్ 5 లో టైటిల్ ఫేవరెట్ గా అడుగుపెట్టిన యూట్యూబర్, షార్ట్ ఫిలిం లీడ్ షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ లో మొదటి ఆరేడు వారాలు కేవలం మోజ్ రూమ్ కే పరిమితమై టాస్క్ లలో అద‌ర‌గొట్టి ర‌న్న‌ర్‌గా నిలిచాడు. సిరితో ఆయ‌న న‌డిపిన వ్య‌వ‌హారం చాలా మందికి నచ్చ‌క ష‌ణ్ముఖ్‌ని ర‌న్న‌ర్ చేశారు. ఇక హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక ష‌ణ్ముఖ్‌కి బ్రేక‌ప్ చెప్పింది దీప్తి సున‌య‌న‌. దీంతో ఇద్దరి దారులు వేరు వేరు అయ్యాయి. ప్ర‌స్తుతం దీప్తి సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ర‌చ్చ చేస్తుండ‌గా, ష‌ణ్ముఖ్ మాత్రం త‌న ప‌ని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

Advertisement

సోషల్ మీడియా వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకుని సంచలనంగా మారిపోయిన వారిలో ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఒకడు. తనదైన శైలి యాక్టింగ్, డ్యాన్సులు, మరికొన్ని వీడియోలతో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. తద్వారా కొన్ని లక్షల మంది అభిమానాన్ని అందుకున్నాడు. చాలా కాలంగా షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమాయణం సాగించిన దీప్తి సునైనా ఇటీవలే సోషల్ మీడియా వేదికగా బ్రేకప్ చెప్పేసిన విషయం తెలిసిందే.బిగ్ బాస్ వల్ల చెడ్డపేరు రావడం.. లవ్ బ్రేకప్ అవడం వల్ల కొంత గ్యాప్ తీసుకున్న షణ్ముఖ్ జస్వంత్ ఇటీవలే తన కొత్త వెబ్ సిరీస్ గురించి ప్రకటన చేశాడు.

shanmukh shares a selfie with her

Advertisement

Shanmukh : ఆ పిక్‌తో అనుమానాలు ఎన్నో..

ప్రస్తుతం అతడు ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ అనే వెబ్ సిరీస్‌ను చేస్తున్నాడు. త్వరలోనే షూట్ స్టార్ట్ కాబోతుంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే షణ్ముఖ్ జస్వంత్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సెల్ఫీని షేర్ చేశాడు. ఇందులో అతడితో పాటు ప్రముఖ నటి వైష్ణవి చైతన్య కూడా ఉంది. గతంలో వీళ్లిద్దరూ కలిసి ‘ద సాఫ్ట్‌వేర్ డెవలపర్’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. వైష్ణవి చైతన్యతో కలిసి తీసుకున్న సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా పెట్టుకున్న షణ్ముఖ్ జస్వంత్.. దీనికి ‘ద సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లో ఈ మొబైల్ ఫోన్ వాడి ఉంటే ఎంత బాగుండేది వైషూ.. డామిట్’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఇక, ఇందులో షణ్ముఖ్ ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. ఈ పిక్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి