
shanmukh speech on runner of game show Bigg Boss 5 Telugu
Shanmukh : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్.. ఆదివారం నాటి ఎపిసోడ్‌తో ముగిసింది. గ్రాండ్ ఫినాలే విజేతగా ఖమ్మం కుర్రాడు వీజే సన్నీ నిలిచాడు. చాలా మంది యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ విజేతగా నిలుస్తాడని అనుకున్నారు. కానీ, చివరి క్షణాల్లో షణ్ముక్ ను పక్కకు నెట్టేసి వీజే సన్నీ విజేతగా అవతరించాడు. ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ టైటిల్ తో పాటు రూ.50 లక్షల ప్రైజ్ మనీ., రూ.25 లక్షల విలువైన ఫ్లాట్, బైక్ గెలుచుకున్నాడు. ఈ సంగతులు అలా ఉంచితే.. బిగ్ బాస్ రన్నర్‌గా నిలిచిన సందర్భంగా షణ్ముక్ జస్వంత్ చేసిన కామెంట్స్ ప్రజెంట్ చర్చనీయాంశమవుతున్నాయి.
నిజానికి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ టైటిల్ షణ్ముక్ గెలుచుకునే వాడని, కానీ, అతడి ప్రవర్తన వల్లే టైటిల్ చేజారిందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తనకు దీప్తి సునయిన అనే గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పటికీ షణ్ముక్.. సిరితో ఫ్రెండ్ షిప్ ముసుగులో రొమాన్స్ చేశాడని కొందరు ఆరోపిస్తున్నారు. ఫ్రెండ్లీ హగ్స్, బెడ్ పైన పక్క పక్కనే పడుకోవడం వంటివి షణ్ముక్ కు మైనస్ అయ్యాయని అంటున్నారు.అటువంటి పనులు చేయడం వల్లే షణ్ముక్ టైటిల్ దగ్గరి దాకా వచ్చి మిస్సయ్యాడని పేర్కొంటున్నారు. ఈ సంగతులు అలా ఉంచితే..
shanmukh speech on runner of game show Bigg Boss 5 Telugu
షణ్ముక్ జస్వంత్ రన్నరప్‌గా నిలిచిన సందర్భంలో ఇచ్చిన స్పీచ్‌పైన డిస్కషన్ జరుగుతోంది. సన్నీ టైటిల్ విన్ అయిన తర్వాత షణ్ముక్‌ను అప్యాయంగా హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే రన్నర్ షణ్ముక్ మాట్లాడాలని నాగార్జున కోరాడు. అప్పుడు షణ్ముక్ మాట్లాడుతూ విన్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.. ఆట ఎలా ఆడాం అన్నదే ఇంపార్టెంట్ అని అన్నాడు. తాను ఇక్కడి వరకు వచ్చినందకు ఆనందంగా ఉన్నానని, అమ్మా నాన్న ఇక్కడకు వచ్చారని అందుకు చాలా హ్యాపీగా ఉందని షణ్ముక్ తెలిపాడు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.