Home » Entertainment » She Committed Suicide By Destroying All Of Silk Smitha Possessions
Entertainment

Silk Smitha : సిల్క్ స్మిత ఆస్తులు అన్నీ కొట్టేసి ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకునేలా చేసిన న‌టుడు ఎవ‌రో తెలుసా?

Authored By
Sam C
The Telugu News | Published on: September 13, 2022, 10:00 pm
Advertisement

Silk Smitha : సిల్క్ స్మిత ఒక‌ప్పుడు టాలీవుడ్ శృంగార తార. ఈ అమ్మ‌డు ఎన్నో సినిమాల‌లో ఐటెం సాంగ్స్ చేసి మంచి పాపులారిటీ అంది పుచ్చుకుంది. నటన, అందంతో పాటు తన డ్యాన్స్‌లతో అభిమానులను అలరించిన ఈ బ్యూటీ అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించిన విషయం తెలిసిందే. 200పైగా తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలో నటించిన సిల్క్ స్మిత హఠాన్మరణం అనేకమంది సినీ ప్రముఖులకు షాక్ ఇచ్చింది. తెలుగులో “బావలు సయ్యా, మరదలు సయ్యా” పాట ఇప్పటికీ అంద‌రిని ఎంత‌గా అల‌రిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే అప్పట్లో హీరోయిన్ల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నా నటిగా పేరు సంపాదించుకుంది.

Advertisement

15 సంవత్సరాల ఆమె సినీ ప్రస్థానంలో ఎన్నో కోట్ల రూపాయల సంపాదించుకుంది. ఈ క్రమంలోనే నిర్మాతగా మారీ ఎక్కువ సంపాదించాలని ఆశపడింది. కాని రాను రాను త‌న ఆస్తి అంత క‌రిగిపోతుండ‌డంతో వ్యసనాలకు లోనై అప్పులు కూడా చేసే స్థాయికి చేరింది. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయలేదు. ఆమె ఎంతగానో ఇష్టపడి ప్రేమించిన స్టార్ హీరో సైతం కష్టాల్లో ఉన్నప్పుడు దూరం పెట్టేసారు. ఆమె ఎంతో నమ్మిన నటుడు మాత్రం చివరలో దారుణంగా మోసం చేసి ఆమెను మరింత దిగజారేలా చేశాడు.మ‌ద్యం మ‌త్తులో ఉన్న‌ప్పుడు సిల్క్ స్మిత‌తో కొన్ని సంతాలు చేయించుకొని ఆమె ఆస్తి మొత్తాన్ని త‌న పేరిట రాయించుకున్నాడ‌ట‌.

She committed suicide by destroying all of Silk Smitha possessions

Advertisement

అలా మోస‌పోయిన సిల్క్ స్మిత చివ‌రి రోజుల‌లో చాలా కుంగిపోయింద‌ట‌. చివరికి తాను సంపాదించిన ఆస్తుల్లో మిగిలిన ఆస్తులను ఏలూరులో ఉన్న తన కుటుంబ సభ్యుల పేరిట రాసి మరణించింది. ఆమె ఆత్మహత్య చేసుకునే ముందు తను రాసిన లేఖలో కొందరు మోసం చేశారని రాసి మరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెను మోసం చేసింది ఎవరో కాదు అప్పట్లో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉండే వ్యక్తి.1996 సెప్టెంబర్ 23న మద్రాసులో తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి సరైన సాక్ష్యం లేకపోవటంతో తాను అలా చేసుకోవడానికి కారణం ప్రేమ వ్యవహారాలు ఉన్నాయని.. ఇండస్ట్రీలో నష్టాలు ఎదురుకుందని అలా ఎన్నో రకాలుగా వార్తలు రాశారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి