tv9 ismart news anchor shiva jyothy get good marks
Shiva Jyothi : శివ జ్యోతి ఈమె గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. న్యూస్ ప్రెజెంటర్స్ గా తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఎంతో మందిని ఆకట్టుకుంది.ఇక ఈమె బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది.ఈమె బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఒకవైపు బుల్లి తెరపై ప్రసారం అయ్యే షోలలో పాల్గొంటూనే మరొకవైపు ఈవెంట్లు, న్యూస్ ఛానల్ తో బిజి బిజీగా ఉంది.బిగ్ బాస్ కీ వెళ్లకముందు తెలంగాణ యాస, కట్టుతో సావిత్రక్కగా బాగా గుర్తింపు సంపాదించుకుంది. తీన్మార్ వార్తలు అనే షోలో సావిత్రి ( శివజ్యోతి) తో పాటు బిత్తిరి సత్తి చేసిన సందడి అంతా ఇంతా కాదు.
వీరిద్దరూ కలిసి రోజువారి వార్తలను తమదైన స్టైల్లో పల్లెటూరి నేపథ్యంలో చెప్పడంతో ఎంతోమంది ఇద్దరికీ అభిమానులు అయ్యారు. ఇక ఈ షోలో శివజ్యోతి కట్టు బొట్టు కూడా ఎంతోమందిని ఆకట్టుకున్నాయి. అచ్చమైన పల్లెటూరి పిల్లలా కనిపిస్తూ శివజ్యోతి ఆకట్టుకుంది. అయితే శివ జ్యోతి కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన అనే విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో శివజ్యోతి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.తాజాగా ఇదే విషయంపై స్పందించింది శివ జ్యోతి.ఇటీవల ఒక ఈవెంట్ కి వెళుతూ మామిడికాయతో ఫోటో పెట్టాను అంతే.
shiva jyothi gives clarity on her pregnancey
అప్పటి నుంచి సోషల్ మీడియాలో నేను ప్రెగ్నెంట్ అంటూ ఫేక్ న్యూస్ అని సృష్టిస్తూ వార్తలు వైరల్ చేస్తున్నారు.వ్యూస్ కోసం కక్కుర్తి పడి ఇష్టం వచ్చినట్లు థంబ్‌నైల్స్ వేస్తున్నారు. అది పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా నాపై చాలా ఎఫెక్ట్ చూపిస్తోంది అని తెలిపింది. మాకు పెళ్లయి చాలా సంవత్సరాలు అయ్యింది.మా పిల్లల కోసం మా ఫ్యామిలీ అంతా ఎంతో ఎదురుచూస్తుంది. నేను కూడా వెయిట్ చేస్తున్నా.ఇది ఎమోషనల్ గా ఎంత బాధపెడుతుందో మీకు చెప్పలేను. నేను ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తుండటంతో కొన్ని ఈవెంట్స్ చేయనేమో అని అనుకుంటున్నారు.అలా నా వర్క్‌ని కూడా దెబ్బతీస్తున్నారు.నిజంగా నా లైఫ్‌లో ఆ గుడ్‌న్యూస్ ఉంటే నేనే మీ అందరితో షేర్ చేస్తాను. అప్పటివరకు ఇలా ఫేక్ న్యూస్ ప్రచారం చేయకండి అని చెప్పుకొచ్చింది శివ జ్యోతి.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.