Home » Entertainment » Shock After The Success Of Baahubali Rana Is Emotional
Entertainment

Rana Daggubati : సినిమా అడ్వాన్సులన్నీ తిరిగి ఇచ్చేశా.. చనిపోవడానికి 30% ఛాన్స్.. అస‌లు రానాకి ఏమైంది..?

Authored By
Suma
The Telugu News | Updated on: February 20, 2026 11:25 am
Advertisement

Rana Daggubati : దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి: ది బిగినింగ్ మరియు బాహుబలి 2: ది కన్క్లూజన్ చిత్రాల్లో భల్లాలదేవ పాత్రతో దేశవ్యాప్తంగా అపారమైన గుర్తింపు సంపాదించారు రానా దగ్గుబాటి. ఆ ప్రతినాయక పాత్ర ఆయనకు కొత్త ఇమేజ్ తెచ్చిపెట్టింది. భారీ శరీరాకృతి, కఠినమైన లుక్, గంభీరమైన నటన ఇవన్నీ కలసి రానాను పాన్-ఇండియా స్టార్‌గా నిలబెట్టాయి. అయితే కెరీర్‌లో అగ్రస్థానంలో ఉన్న సమయానికే ఆయన జీవితంలో ఊహించని మలుపు తిరిగింది. ఆరోగ్య సమస్యలతో ఒక్కసారిగా కుదేలయ్యారు. మొదటిసారి తనకు తీవ్రమైన అనారోగ్యం ఉందని తెలిసినప్పుడు తీవ్ర షాక్‌కు గురయ్యానని రానా గుర్తుచేసుకున్నారు. “ఆ సమయంలో నాకు బతకడమే ముఖ్య లక్ష్యంగా మారింది. డాక్ట,ర్లు చనిపోయే అవకాశం 30 శాతం ఉందని చెప్పినప్పుడు జీవితంపై నా దృష్టికోణం పూర్తిగా మారిపోయింది” అని తెలిపారు.

Advertisement

Rana Daggubati : ‘భల్లాలదేవ’ విజయానంతరం ఎదురైన షాక్ .. చావు అంచుల దాకా వెళ్లొచ్చా .. రానా ఎమోషనల్..

Rana Daggubati : కిడ్నీ సమస్యతో ప్రాణాపాయం

రానా వెల్లడించిన వివరాల ప్రకారం ఆయనకు కిడ్నీ సమస్య తీవ్రమైంది. “నా కిడ్నీలు దెబ్బతిన్నాయి. 70 శాతం వరకు స్ట్రోక్ లేదా బ్రెయిన్ హెమరేజ్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. అది నా జీవితంలో అత్యంత భయంకరమైన దశ” అని ఆయన భావోద్వేగంగా తెలిపారు. అమెరికాలో చికిత్స తీసుకున్న సమయంలో పూర్తిగా తన ఆరోగ్యంపైనే దృష్టి పెట్టానని చెప్పారు. సినిమాల నుండి కొంతకాలం విరామం తీసుకుని చికిత్స, మందులు, శరీరపరమైన మార్పులను ఎదుర్కొన్నారు. “సినిమాలే నన్ను మళ్లీ నిలబెట్టాయి. ఒక హీరోలా తిరిగి రావాలనే సంకల్పాన్ని ఇచ్చాయి” అని రానా చెప్పడం ఆయన మనోబలాన్ని చూపిస్తోంది. సుమారు ఏడాది పాటు చికిత్స పొందిన తర్వాత భారత్‌కు తిరిగి వచ్చారు. అయితే ఆ కాలంలో తీసుకున్న మందులు, శారీరక ఇబ్బందుల వల్ల ఆయన రూపంలో గణనీయమైన మార్పు వచ్చింది. ఒకప్పుడు భారీ కండలతో కనిపించిన రానా బాగా సన్నబడ్డారు. ఆ మార్పును అంగీకరించడం తనకు చాలా కష్టంగా అనిపించిందని తెలిపారు.

Advertisement

Rana Daggubati : అడ్వాన్సులు తిరిగిచ్చిన నిజాయితీ

అనారోగ్యానికి ముందు ఒప్పుకున్న కొన్ని సినిమాలు ట్రీట్‌మెంట్ తర్వాత చేయలేకపోయానని రానా వెల్లడించారు. ముఖ్యంగా ఒక రెజ్లర్ కథతో తెరకెక్కాల్సిన సినిమా కోసం ఇప్పటికే అడ్వాన్స్ తీసుకున్నానని కానీ చికిత్స తర్వాత ఆ పాత్రకు అవసరమైన శరీరాకృతి తన దగ్గర లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పారు. “తీసుకున్న అడ్వాన్స్ మొత్తం తిరిగి ఇచ్చేశాను. అది నా బాధ్యతగా భావించాను” అని స్పష్టం చేశారు. ఈ విషయాలన్నీ ఆయన రియా చక్రవర్తితో జరిగిన ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన ఆరోగ్య పోరాటం తనను మరింత బలంగా మార్చిందని జీవితం అంటే ఏమిటో నేర్పిందని అన్నారు. ప్రస్తుతం రానా తిరిగి తన కెరీర్‌పై దృష్టి సారించారు. ఇటీవల ‘కాంతా’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చావు అంచుల దాకా వెళ్లి తిరిగి వచ్చిన ఈ అనుభవం ఆయనలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. జీవితం ఇచ్చిన రెండో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్న రానా కథ అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి