Rashmi Gautam : ఆ సినిమాలో నితిన్ కు జోడి కట్టాల్సింది ‘రష్మీ”నా..?
ప్రధానాంశాలు:
Rashmi Gautam : ఆ సినిమాలో నితిన్ కు జోడి కట్టాల్సింది 'రష్మీ''నా..?
Rashmi Gautam : సినీ ఇండస్ట్రీలో ఎవరికీ ఎప్పుడు అదృష్టం బాగా కలిసి వస్తుందో చెప్పలేం. ఒక్క సినిమాతో స్టార్ హీరోలు, హీరోయిన్లు అవ్వగా, కొందరు మాత్రం అవకాశాలు కోల్పోయి వెండితెరపై నిలదొక్కుకోవడంలో విఫలమవుతారు. ఈ కోవలోకే ప్రముఖ యాంకర్, నటి రష్మీ గౌతమ్ కూడా వస్తుంది. సినిమాల్లో తనకు సరైన బ్రేక్ రాకపోవడంతో బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకాదరణ పొందింది. అయితే ఇటీవల నితిన్ చేసిన వ్యాఖ్యలు ఆమె సినీ కెరీర్ గురించి కొత్త చర్చకు తెరతీశాయి.

Rashmi Gautam : ఆ సినిమాలో నితిన్ కు జోడి కట్టాల్సింది ‘రష్మీ”నా..?
Rashmi Gautam పాపం.. స్టార్ హీరోయిన్ కావాల్సిందే.. ఇలా అయ్యింది
రీసెంట్‌గా ‘రాబిన్ హుడ్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నితిన్ ఓ టీవీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన డెబ్యూట్ సినిమా ‘జయం’ గురించి మాట్లాడారు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తొలుత హీరోయిన్‌గా రష్మీని ఎంపికచేశారు. షూటింగ్‌కు ముందుగా రష్మీతో రిహార్సల్స్ కూడా చేశారు. కానీ చివరి నిమిషంలో ఏమైందో తెలియదు కానీ మేకర్స్ హీరోయిన్‌గా సదాను ఫైనల్ చేశారు. దీనిపై నితిన్ మాట్లాడుతూ.. “రష్మీ ఆ సినిమా చేసిఉంటే ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ అయ్యేది” అని వ్యాఖ్యానించారు. ఈ మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
రష్మీ అయితే వెండితెరపై అవకాశాలు తగ్గిపోవడంతో బుల్లితెరను ఆశ్రయించింది. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు జయం సినిమాలో హీరోయిన్‌గా నటించిన సదా తనదైన గుర్తింపును పొందింది. ఆమె పలు సినిమాల్లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నా, ప్రస్తుతం టాలీవుడ్‌లో అంతగా కనిపించడం లేదు. ఆమె జడ్జిగా కొన్ని టీవీ షోలలో పాల్గొంటూ కెరీర్ కొనసాగిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఒకవేళ ‘జయం’ సినిమాలో రష్మీ గౌతమ్ హీరోయిన్‌గా నటించి ఉంటే ఆమె కెరీర్ మరింత ఉన్నత స్థాయిలో ఉండేదని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.