Hyper Aadi : బుల్లితెరపై చేసే టీఆర్పీ స్టంట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ప్రజలకు అది టీఆర్పీ స్టంట్ అని తెలుస్తుంది. వారు చెడామడా తిడుతుంటారు. ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండని, ఇంకెన్నాళ్లు జనాల్ని పిచ్చోళ్లను చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. జనాలు ఎంతగా చీ కొడుతున్నా కూడా మల్లెమాల టీం మాత్రం తన ధోరణిని మార్చుకోవడం లేదు. మార్చుకోవాలని అనుకోవడం కూడా లేదు. ఎప్పటికప్పుడు టీఆర్పీ స్టంట్లు వేస్తూనే ఉంటుంది. ప్రోమోల్లో కాంట్రవర్సీలను పెడుతూనే ఉంటుంది.
తాజాగా ఢీ షోకు సంబంధించిన ప్రోమో బయటకు వచ్చింది. ఇందులో శ్రద్దా దాస్ ఓ గెస్ట్ జడ్జ్‌గా వచ్చింది. ఆమె ఓ పర్ఫామెన్స్‌ను చూసి.. స్టేజ్ మీదకు వచ్చి డ్యాన్స్ చేసింది. సత్య భామ సత్య భామ సంగతేంటమ్మా అంటూ రాజశేఖర్ స్టెప్పులను స్టేజ్ మీద వేశారు. ఆ పర్ఫామెన్స్‌ను చూసి శ్రద్దా దాస్ స్టేజ్ మీదకు వచ్చి స్టెప్పులు వేసింది. దీంతో మరో మాస్టర్ హర్ట్ అయ్యాడు. కిరణ్ అనే మాస్ఱర్ స్టేజ్ మీదే అందరినీ దుమ్ముదులిపేశాడు. ఇదంతా కూడా ముందే అనుకుని చేశారంటూ, పక్షపాతం చూపిస్తున్నారంటూ ఆరోపించాడు.
దీంతో ఆది, ప్రదీప్, శ్రద్దా దాస్ డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ అతను మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నారు అని అందరినీ నిలదీశాడు. ఇదంతా కూడా సెన్స్ లెస్‌గా ఉందంటూ శ్రద్దా దాస్ అతడి మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదంతా కూడా పార్శియాలిటీలా ఉందని మళ్లీ అంటాడు. అలాంటి మాటలు అంటే.. నిన్ను సెన్స్ లెస్ అని అనాల్సి వస్తుందని ప్రదీప్ అంటాడు.. నేను కూడా అంత కంటే ఎక్కువే అంటాను అని కిరణ్ అంటాడు.
ఇలా మాటా మాటా పెరుగుతుంది. ఆది కూడా మధ్యలోకి ఎంట్రీ ఇస్తాడు. కామెడీలు చేయకు అంటూ ఆది మీద కూడా కిరణ్ ఫైర్ అవుతాడు. ఇక జడ్జ్‌లా వచ్చి ఇలా చేయడం బాగా లేదంటూ అతగాడు అనడంతో శ్రద్దా దాస్ హర్ట్ అయి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ ప్రోమోను చూసి జనాలు మల్లెమాల మీద తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.