Home » Entertainment » Shree Rapaka Confirmed For Bigg Boss Ott
Entertainment

Bigg Boss OTT : అందాల‌తో ర‌చ్చ చేసే ఈ ముద్దుగుమ్మ‌కు బిగ్ బాస్ నుండి పిలుపు.. ఇక యువ‌త‌కి నిద్ర ఉండ‌న‌ట్టే…!

Authored By
Sam C
The Telugu News | Published on: February 19, 2022, 6:30 pm
Advertisement

Bigg Boss OTT : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచేందుకు బిగ్ బాస్ ఓటీటీ సిద్ధ‌మైంది. నో కామా.. నో ఫుల్‌స్టాప్.. బిగ్‌బాస్ అయింది నాన్‌స్టాప్!! 24 గంటల పాటు పూర్తి స్థాయి వినోదాన్ని పంచడానికి ఓటీటీ బిగ్ బాస్ తెలుగు రెడీ అయ్యింది. ఫిబ్రవరి 26 శనివారం నుంచి డిస్నీ హాట్ స్టార్‌లో ఈ షో ప్రసారం కానుంది. దీనికి సంబంధించి ప్రోమో విడుదలై అనేక పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. 3, 4, 5 సీజన్లకు హోస్ట్‌గా హ్యాట్రిక్ కొట్టిన నాగార్జునే.. బిగ్ బాస్ ఓటీటీకి హోస్టింగ్చే యబోతున్నారు. ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా ముగించుకున్న ఈ షో..ఇప్పుడు డిజిటల్ వెర్షన్ లో స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

ఈ షో డిస్నీ+హాట్‌స్టార్‌లో 24*7 ప్రసారం కానుంది. ఇందులో కంటెస్టెంట్స్ ఎవ‌రెవ‌రు ఉంటారు అనే దానిపై అనేక ప్రచారాలు న‌డుస్తున్నాయి. ఇప్పుడు స్వీటీ కూడా బిగ్ బాస్ ఓటీటీలో సంద‌డి చేయ‌నుంద‌ని స‌మాచారం. అప్పట్లో వ‌ర్మ‌ ఈ వెస్ట్ గోదావరి స్వీటీ పాపతో అనే చిత్రాన్ని రూపొందించి ఆన్ లైన్‌లో రిలీజ్ చేసి కాసులు కురిపించాడు. దేశముదురు, చందమామ, యువత, నచ్చావులే ఇలా చాలా సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేసి ఇండస్ట్రీ వ్యక్తులతో మంచి సంబంధాలు ఉన్న ఈ స్వీటీ పాప అసలు పేరు శ్రీ రాపాక. ఊరు వెస్ట్ గోదావరిలోని దేవరపల్లి.

shree rapaka confirmed for bigg boss ott

Advertisement

Bigg Boss OTT : అందాల జాత‌రే…

న‌గ్నం సినిమాలో ఈ బ్యూటీ చేసిన ర‌చ్చ మామ‌లుగా లేదు. త‌న అందాల‌ను యదేచ్చ‌గా ఆర‌బోసి ర‌చ్చ చేసింది. పూర్తిగా అందాల జాత‌ర చేసిన ఈ స్వీటీ ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీలో సంద‌డి చేస్తే కుర్ర‌కారుకి కంటిపై కునుకు కూడా లేకుండా పోతుంద‌ని అంటున్నారు. అరియానా గ్లోరీ, అఖిల్, ముమైత్ ఖాన్, సరయు, హమీద, నటరాజ్, మహేష్ విట్టా, మోడల్ అనిల్ రాథోడ్, అషు రెడ్డి, యాంకర్ స్రవంతి, ఆర్జే చైతు, చిచా చార్లెస్, యాంకర్ శివ, విశ్వక్ మూవీ హీరో అర్జున్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా వీజే సన్నీ, రన్నరప్ గా షణ్ముఖ్ జస్వంత్ నిలిచారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి