Home » Entertainment » Shriya Saran Mind Blowing Looks
Entertainment

Shriya Saran : బెడ్ పైన ప‌డుకొని వ‌య్యారాలు పోతూ మైండ్ బ్లాక్ చేస్తున్న శ్రియ‌

Authored By
Sam C
The Telugu News | Published on: October 16, 2022, 12:30 pm
Advertisement

Shriya Saran : శ్రియ శ‌ర‌న్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో కుర్రాళ్ల హృద‌యాలు గెలుచుకున్న శ్రియ టాలీవుడ్ స్టార్ హీరోలంద‌రితో న‌టించి మెప్పించింది. . ఆమె అప్పట్లో ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం ఓపెనింగ్స్ అందుకునేవి. ఇష్టం అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్‌గా పరిచయమైన సౌత్ యాక్టరస్‌ శ్రియ శరణ్‌ ఓవైపు సినిమాలు చేస్తూనే ..మరోవైపు ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది. వివాహం జరిగిన తర్వాత, ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా వచ్చిన ఆఫర్లను వదులుకోకుండా సినిమాలు చేస్తూ వస్తోంది శ్రియ

Advertisement

రీసెంట్‌గా శ్రియ‌.. రాజమౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో అజయ్‌దేవగన్‌కి జోడిగా నటించి మెప్పించింది. ట్రెడిషనల్, మోడ్రన్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఇంట్లో భర్త, కూతురుతో చేసే సందడి వీడియోలు, ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ఫాలోవర్స్‌ కోసం షేర్ చేస్తుంది శ్రియ. తాజాగా ఈ అమ్మ‌డు బెడ్ పై ప‌డుకొని మ‌త్తెక్కించిన అందాల‌తో కుర్ర‌కారు హృద‌యాల‌ని గుల్ల చేసింది. 40 ఏళ్ల వ‌య‌స్సులో శ్రియ అందాల ర‌చ్చ చూసి ప్ర‌తి ఒక్క‌రు మెస్మ‌రైజ్ అవుతున్నారు. అంతేకాదు ఈ బ్యూటీని చూసి నోరెళ్ల పెడుతున్నారు.

shriya saran mind blowing looks

Advertisement

Shriya Saran : ఏంది ఈ ర‌చ్చ‌..

ఇక 2018లో శ్రియ శరన్ ఆండ్రీ కోస్చీవ్ అనే విదేశీయుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. గత ఏడాది ఇక పండంటి ఆడపిల్లలకు కూడా జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఆ మ‌ధ్య గోవా బీచ్‌లో కూతురిని భర్త, తను ఆడిస్తున్న వీడియోని శ్రియ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ వీడియోలో శ్రియ శరీర అందాలు చూపిస్తూనే జాలీగా ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలను వీడియోలో బంధించి షేర్ చేసి కుర్రాళ్ల మ‌న‌సులు దోచుకుంది. ఇక స్పెషల్ ఐటెం సాంగ్స్ లో కూడా చాలాసార్లు శ్రీయ మెప్పించే ప్రయత్నం చేసింది. అప్పట్లో ఆమెకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ కూడా ఇచ్చారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి