Shruti Hassan Stunning Look in Black Dress Spotted with her Boy Friend at Mizu Restauran
Shruti Haasan : తెలుగు ఇండస్ట్రీలో హీరో సిద్ధార్థ్ నటించిన ‘ అనగనగా ఓ ధీరుడు ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శృతి హాసన్. ఇక తన తండ్రి శ్రుతి హాసన్ పేరు చెప్పుకొని ఇండస్ట్రీ లోకి వచ్చిన తను సొంత టాలెంట్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళుతోంది. ఈ ఏడాది ఆరంభంలో వీరసింహారెడ్డి , వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ప్రభాస్ కు జోడి ‘ సలార్ ‘ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది.
Shruti Haasan answer to netizens about her marriage
మరోవైపు కోలీవుడ్, హాలీవుడ్ సినిమాలలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక తన వ్యక్తిగత విషయానికొస్తే గత రెండేళ్ల నుంచి ఈ బ్యూటీ చిత్రకారుడు శంతను హజారికాతో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. అయితే తాజాగా శృతిహాసన్ సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ మీ పెళ్లెప్పుడు అని అడగగా దానికి బదులుగా శృతిహాసన్ ఊహించని ఆన్సర్ ఇచ్చింది. ఇప్పటికే ఈ ప్రశ్న వినీ వినీ చాలాసార్లు బోర్ కొట్టేసింది అన్నట్లుగా సమాధానం ఇచ్చింది. పెళ్లి గురించి కాకుండా ఇంకేమైనా అడగండి అంటూ శృతి తెలిపింది.
దీంతో శృతి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని పరోక్షంగా చెప్పింది. ఇక జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదలైన బాలయ్య వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాలతో శృతిహాసన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ఇక కోలీవుడ్ లో కూడా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ అక్కడ కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. కోలీవుడ్ స్టార్ ధనుష్ తో త్రీ అనే సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటించిది. ఈ సినిమాలో వీళ్ళ రొమాన్స్ చూసి చాలామంది వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.
Cardamom Milk : రాత్రి పడుకునే ముందు పాలు తాగితే ఆరోగ్యమని మనందరికీ తెలుసు. పాలలో కొన్ని పదార్థాలు కలిపి…
Salt In Healthy Foods : ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఉప్పు లేనిదే తినం. ఉప్పు ఆహారంలో ప్రధానమైన భాగం.…
Apply Oil Benefits Of Belly : వైద్యశాస్త్రం ప్రకారం మానవ శరీరంలో ఏడు ప్రధాన బిందువులలో ఒకటిగా పేర్కొనబడిందే…
Redmi A5 : ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ అయిన షియోమీ తాజాగా భారత మార్కెట్లో బడ్జెట్ ఫోన్ Redmi A5ను…
AP 10th Class Results : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా…
Capsicum : క్యాప్సికం ప్రియులకు చేదు కబురు. క్యాప్సికం తినేవారు తప్పక ఈ విషయాలు తీసుకోవాల్సిందే... సుఖం తినడం వల్ల…
New Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజల కోసం మరో సంక్షేమ నిర్ణయం తీసుకుంది. కొత్తగా అర్హులైన వారికి…
Numerology : పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి జాతకం, అబ్బాయి జాతకం రెండు కలిస్తేనే వారి జీవితం బాగుంటుంది అని జ్యోతిష్యులు…
This website uses cookies.