Home » Entertainment » Shruti Haasan Talks About Her Movies Characters
Entertainment

Shruti Haasan : కొంచెం కూడా సిగ్గు లేకుండా పచ్చిగా పబ్లిక్ గా ఒప్పేసుకుందిగా.. శృతి హాసన్ ఏంటి ఇలా తయారైంది?

Authored By
Breaking News 2
The Telugu News | Published on: January 21, 2023, 5:20 pm
Advertisement

Shruti Haasan : ఈ సారి సంక్రాంతి మొత్తం శృతి హాసన్ మీది నుంచే వెళ్లిందని చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఈ సంక్రాంతికి విడుదలైన రెండు పెద్ద సినిమాల్లో హీరోయిన్ గా నటించింది శృతి హాసనే. అందుకే.. ఈ మధ్య శృతి హాసన్ కు విపరీతంగా హైప్ వచ్చేసింది. అటు బాలయ్య బాబు వీరసింహారెడ్డి సినిమాలో.. ఇటు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాల్లో నటించి మెప్పించింది శృతి హాసన్. అయితే.. ఈ రెండు సినిమాల్లో తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది కానీ..

Advertisement

తనకు అంతగా ఈ సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలు అయితే అవి కావు. పేరుకే హీరోయిన్ అన్నట్టుగా శృతి హాసన్ రెండు సినిమాల్లో కనిపించింది.అయితే.. తన పాత్ర గురించి ముందే తెలిసే తాను ఈ పాత్రల్లో నటించానంటూ చెప్పుకొచ్చింది శృతి హాసన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శృతి హాసన్.. తన తండ్రి అంత వయసు ఉన్న చిరంజీవి, బాలకృష్ణల సరసన నటించడానికి కారణం ఏంటని ప్రశ్నించగా.. వాళ్లు ఇద్దరూ పెద్ద హీరోలు అవడం వల్ల.. పెద్ద సినిమాలు అవడం వల్ల తాను ఒప్పుకున్నానని చెప్పుకొచ్చింది శృతి.

shruti haasan talks about her movies characters

Advertisement

Shruti Haasan : రెండు సినిమాల్లో నా పాత్ర చిన్నదే అని నాకు తెలుసు

నాకు ముందే కథ తెలుసు. నా పాత్రలు ఏంటో కూడా తెలుసు. అన్నీ తెలిసే నేను ఈ సినిమాలకు ఒప్పుకున్నా. వాళ్లు నా వయసు కంటే పెద్దవారని నాకు తెలుసు. అందరికీ తెలుసు. నాకు వారితో యాక్ట్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది కలగలేదు. డైరెక్టర్స్ వాళ్ల పక్కన సూట్ అవుతా అనుకుంటేనే నన్ను తీసుకుంటారు కదా. నటిగా నాకు ఇచ్చిన పాత్రలో నటించడమే నాకు తెలిసింది. అంతే.. మిగితావి ఏవీ నేను పట్టించుకోను అంటూ సూటిగా సుత్తి లేకుండా శృతి హాసన్ చెప్పుకొచ్చింది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి