
Shruti Haasan who made a difference between Chiranjeevi and Balayya
Sruthi Hassan: తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పండగకి కోడిపందాలు. గాలిపటాలు ఎగరగవేయడం…ముగ్గులు వేయడంతో పాటు థియేటర్స్‌లో పెద్ద సినిమాల సందడి ఉంటుంది. రాబోయే సంక్రాంతికి మాత్రం బాక్సాఫీస్ ఫైట్ మామూలుగా ఉండదు అని అర్ధమవుతుంది. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, తమిళ స్టార్ హీరో విజయ్ తో పలువురు హీరోలు ఈ సంక్రాంతికి పోటీ పడబోతున్నారు. అయితే యంగ్ హీరోలుగా ఉన్న సమయం నుండి బాలయ్య చిరు దాదాపు 30 సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగగా,
చాలాకాలం తర్వాత మళ్లీ ఇద్దరూ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని సంక్రాంతికి సందడి చేయనుండగా, బాలయ్య వీర సింహారెడ్డితో పలకరించనున్నాడు. ఈ ఇద్దరిలో గెలుపు ఎవరిదా అనే చర్చ మొదలైంది. అయితే ఇక్కడ ఓ సెంటిమెంట్ కూడా చర్చకు వస్తుంది. గతంలో సంక్రాంతి బరిలో చిరంజీవి, బాలయ్య మృగరాజు, సమరసింహా రెడ్డి చిత్రాలతో బరిలోకి దిగారు. ఈ రెండు చిత్రాలలో సిమ్రాన్ కథానాయికగా నటంచగా, వీటిలో మృగరాజు అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. సమర సింహా రెడ్డి విజయం సాధించింది.
Shruti Haasan who made a difference between Chiranjeevi and Balayya
ఇక ఇప్పుడు సంక్రాంతికి రాబోతున్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. రెండు సినిమాల్లోనూ శృతి 30 + ఏజ్ క్యారెక్టర్‌లో కనిపించబోతోందని తెలుస్తుంది. గతంలో సిమ్రాన్ సెంటిమెంట్ ప్రకారం బాలయ్యకు హిట్ దక్కింది. ఈసారి శృతి హాసన్ సెంటిమెంట్ ఎవరికి కలిసి వస్తుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. . అయితే ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాలో శృతి పాత్ర హైలెట్ అవుతుంది… ఏ సినిమాతో మంచి గుర్తింపు వస్తుందన్న దానిపై చిరు, బాలయ్య అభిమానుల మధ్య కామెంట్ల చర్చ కూడా నడుస్తుంది. మరి చూడాలి రానున్న రోజులలో శృతి ఏం చేయబోతుందా..
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.