Home » Entertainment » Shruti Hassan Gives Clarity About Her Marriage
Entertainment

Shruti Haasan : పెళ్లి వ‌ద్దు, డేటింగ్ ముద్దంటున్న శృతి హాసన్

Authored By
Sam C
The Telugu News | Published on: June 8, 2022, 2:30 pm
Advertisement

Shruti Haasan : విశ్వనటుడు కమల్ హాసన్ పెద్ద కూతురు శృతిహాసన్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఏళ్ళు గడుస్తోంది. అయితే ఈ బ్యూటీ సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. చిన్న హీరోలతోనే కాకుండా అగ్ర హీరోలతో కూడా ఆమె సినిమాలు చేస్తూ చాలా బిజీగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అయితే చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. అందులో ఏ ఒక్కటి హిట్ అయినా కూడా ఆమె రేంజ్ మరో లెవల్ కు వెళ్ళినట్లే అని చెప్పవచ్చు. అందం. ఆకర్షణ కలిసి ఉన్న కోలీవుడ్ భామకు భారీ ప్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.

Advertisement

ఈ ఏడాది ఏకంగా మూడు పెద్ద సినిమాల్ని లైన్‌లో పెట్టుకుంది. ‌గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సీనియర్ హీరో బాలయ్య సరసన హీరోయిన్ గా ఆడిపాడబోతోంది బ్యూటీ.మెగాస్టార్ చిరంజీవి సరసన బాబీ డైరెక్ట్ చేస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ సలార్ లోనూ సందడి చేయబోతోంది శృతి హాసన్. ప్రస్తుతం శాంతను హజారికా తో కలిసి సహజీవనం చేస్తోంది. ఇద్దరు కలిసి హ్యాపీగా షికార్లు చేసుకుంటూ.. సోషల్ మీడియాలో వీడియోలు అప్ లోడ్ చేసుకుంటూ.. సందడిచేస్తున్నారు ఇద్దరు. ఈ క్రమంలోనే శృతి హాసన్ కు ఒక ప్రశ్న ఎదురయ్యింది.

shruti hassan gives clarity about her marriage

Advertisement

దానికి ఆమె డిఫరెంట్ గా సమాధానం ఇచ్చింది.పెళ్ళెప్పుడు అని శ్రుతిని అడగ్గా.. దానికి సమాధానమిస్తూ, పెళ్ళంటేనే భయమేస్తోంది…. నా తల్లిదండ్రుల పెళ్ళి విడాకులకు దారితీసిందని నేను ఈ మాట చెప్పడం లేదు. కానీ, నాలో పెళ్లి అంటే అదోరకమైన భయం ఏర్పడుతోంది అని అంటోంది శ్రుతి. స‌హాజీవ‌న‌మే బెట‌ర్ అన్న‌ట్టుగా ఈ అమ్మ‌డు ముందుకు వెళుతుంది. శాంతను నా జీవితంలోకి ప్రవేశించిన తర్వాత అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అనేక విషయాల్లో మా ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయి అని వివరించింది శ్రుతి హాసన్.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి