Shweta Basu : టాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ చాలా కాలం తర్వాత దర్శనమిచ్చింది. ఈ బ్యూటీ మళ్లీ మీడియా ముందుకు రావడంతో ఈమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం ఎక్కడ పోయారని అడిగేవారు కూడా చాలా మందే ఉన్నారు. శ్వేతా బసు.. ఈ అమ్మడి అందం, అభినయం గురించి పెద్దగా పరిచయం అవసరం లేదనుకుంట.. పొట్టిగా ఉన్నా తన కళ్లతోనే మాయ చేసేస్తుంది.
తెలుగు చిత్రపరిశ్రమలో శ్వేతాబసు నటించిన సినిమాలు వేళ్ల మీద లెక్కబెట్టవచ్చును. కొత్త బంగారు లోకం మూవీతో ఈ నటి తన కెరీర్‌లోనే అదిరిపోయే హిట్ అందుకుంది. ఆ తర్వాత రైడ్ సినిమాలో కనిపించింది. ఇక ఆ తర్వాత అస్సలు సినిమాల్లో కనిపించకుండా ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. దీనంతంటికీ కారణం మీడియా వారే అని గతంలో ఆమె ఫైర్ అయ్యింది. శ్వేతా బసు ప్రసాద్ చాలా చిన్నవయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే.రెండు సినిమాల తర్వాత ఈ మద్దుగుమ్మకు సినిమాలు తగ్గిపోయాయి.దీంతో ఆమె అవకాశాల కోసం అడ్డదారులు తొక్కిందని వార్తలు వచ్చాయి.
ఓ రోజు ఏకంగా కొత్తబంగారులోకం హీరోయిన్ వ్యభిచారం చేస్తూ పట్టుబడిందని వార్తలు వచ్చాయి.మీడియా కూడా ఇదే విషయాన్ని పదే పదే ప్రచారం చేయడంతో ఆమె కెరీర్ ఒక్కసారిగా ముగిసిపోయింది.దీంతో ఆ బాధ భరించలేక హైదరాబాద్ విడిచి కొంత కాలం తన ఇంటికి వెళ్లిపోయిందట. ఆ తర్వాత బాలీవుడ్‌లో అవకాశాల కోసం ప్రయత్నించింది.తాజాగా మీడియా ముందుకు వచ్చిన శ్వేతా బసు ప్రసాద్ మాట్లాడుతూ.. తన లేటెస్ట్ మూవీస్ గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చాలా మారిపోయింది. క్లిమినల్ జస్టిస్ అనే వెబ్ సిరీస్‌లో ఈ అమ్మడు కీలక పాత్ర పోషించింది. దీనికి మంచి టాక్ రావడంతో అవకాశాలు కూడా వస్తున్నట్టు తెలిపింది. కాగా,గతంలో తన జీవితంలో జరిగిన డార్క్ డేస్‌ను ఎప్పటికీ మర్చిపోలేనని ఈ నటి నేటికి తన సన్నిహితులతో చెప్పుకుని బాధపడుతుందట..
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.