Siddhu Jonnalagadda : మరోసారి ముద్దు సీన్ కోసం డేజీ టిల్లు తంటాలు.. ఏం జరిగింది అంటే..!
Siddhu Jonnalagadda : సిద్ధు జొన్నలగడ్డ స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన చివరిగా నటించిన డీజే టిల్లు స్వ్కేర్ చిత్రం మంచి విజయం సాధించింది. ఇందులో రొమాంటిక్ సీన్స్ చాలా మందిని ఆకట్టుకున్నాయి. సిద్ధు నటిస్తున్న తాజా సినిమా ‘జాక్’. వైష్ణవి చైతన్య హీరోయిన్. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన టీజర్ తో ప్రామిసింగ్ అనిపించుకున్న ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా ఓ సాంగ్ విడుదల చేశారు.
Siddhu Jonnalagadda : మరోసారి ముద్దు సీన్ కోసం డేజీ టిల్లు తంటాలు.. ఏం జరిగింది అంటే..!
‘భాగ్య నగరం అంతా మనదే మనదే.. నీ బాధే తీరుస్తా పదవే పదవే.. జంటై పోదాం అందే పెదవే పెదవే.. దునియాతో పనిలేదింకా పదవే పదవే ..’ అంటూ మొదలైన ఈ పాటకు ముందు వచ్చిన సీన్ చూస్తే.. హీరోయిన్ హీరోను ముద్దు అడగటం అందుకోసం అతనికి ఎక్కడా సరైన స్థలమే దొరకలేదు అని చెబుతూ నగరం అంతా సరైన ప్లేస్ కోసం తిరుగుతూ ఉండగా వచ్చే పాటలా ఉంది. అయితే ఈ మూవీ ప్రమోషన్ో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధూకి ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి
కిస్ కోసం ఎప్పుడైన వెతికారా అని అడిగినప్పుడు టిల్లు స్కేర్‌లో నేను అయితే ఎక్కడ వెతకలేదు. ఇక్కడ కూడా వెతుకుతున్నా అనే నమ్మకం లేదు. నేను వెతకను జాక్ వెతుకుతూ ఉంటుంది అని సిద్ధు బదులిచ్చాడు. ఈ సినిమాలో మంచి సీక్వెన్స్ లతో పాటు డ్యాన్స్ లు కూడా బాగా కంపోజ్ చేస్తాడు రాజు సుందరం. అతనితోనే కొరియోగ్రఫీ చేయించారు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించిన ఈ గీతాన్ని సనరే రాశారు. జావేద్ అలీ, అమలా చేబోలు కలిసి పాడారు. సింపుల్ గా సాగుతూ ఆకట్టుకునేలా ఉంది. కాస్ట్యూమ్స్ బావున్నాయి. వైష్ణవి చైతన్య పూర్తిగా చీరలోనే ఉండటం బలే అనిపిస్తుంది. ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
This website uses cookies.