Home » Entertainment » Siddu Jonnalagadda In Secret Relati0nship With Director
Entertainment

Siddu Jonnalagadda : డిజే టిల్లు .. వాడి స్టైలే వేరు .. డైరెక్టర్ తో సీక్రెట్ రిలేషన్షిప్ లో ఉన్న సిద్దు జొన్నలగడ్డ ..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: April 14, 2023, 4:00 pm
Advertisement

Siddu Jonnalagadda : సిద్దు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సీనియర్ డైరెక్టర్ జొన్నలగడ్డ శ్రీనివాసరావు తనయుడిగా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సిద్దు జొన్నలగడ్డ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. యూత్ లో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ సినిమా కు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. డీజే టిల్లు స్క్వేర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభించినప్పటి నుంచి ఏదో ఒక కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది.

Advertisement

Siddu Jonnalagadda in secret relati0nship with director

ముందుగా ఈ సినిమా సీక్వెల్ నుంచి డైరెక్టర్ విమల కృష్ణ తప్పకున్నాడు. ఆ తర్వాత హీరోయిన్ల విషయంలో చాలామంది పేర్లు వినిపించాయి. తర్వాత హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నారు. కొద్దిరోజుల క్రితం షూటింగ్లో అనుపమ, సిద్దు మధ్య గొడవలు రావడంతో ఆమె సినిమా నుంచి తప్పుకుందని ప్రచారం జరిగింది. అయితే వీటన్నింటిపై సిద్దు స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ప్రారంభించినప్పటి నుంచి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ముందుగా ఈ సినిమాకు హీరోయిన్ అనుపమనే తీసుకోవాలని

Advertisement

అనుకున్నాము అని చెప్పాడు. ఇక డైరెక్టర్ విమల కృష్ణతో గొడవ పై స్పందిస్తూ లైవ్ లోనే కాల్ చేసి మాట్లాడారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. డిజె టిల్లు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్న డైరెక్టర్ మాలిక్ రామ్ తో తాను రిలేషన్ లో ఉన్నానని, అతడు మా ఇంట్లోనే ఉంటాడు, మా ఇంట్లోనే తింటాడు. అతడు పడుకుంటే దుప్పటి కూడా నేనే కప్పుతాను. అతడితో రిలేషన్షిప్ మైంటైన్ చేస్తున్న అని సరదాగా అన్నాడు. అయితే సిద్దు ఆ డైరెక్టర్ తో రిలేషన్షిప్ లో ఉండడం ఏంటి కొంచెం తేడా గానే ఉన్నాడు డిజె టిల్లు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి