Bigg Boss Siri boy friend enter into bigg boss
Siri-Srihan: బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత సిరి- శ్రీహాన్, దీప్తి షణ్ముఖ్ జంటలు నిత్యం వార్తలలో నిలుస్తూ వచ్చారు. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు సిరి, షన్నులు హద్దులు దాటేశారు. హగ్గులు, ముద్దులు, రిలేషన్ అంటూ ట్రిప్ అవుతున్నా అంటూ చాలా ఓవర్ చేసేశారు. ఇక ఆ ఇద్దరి రొమాన్స్ మీద లెక్కలేనన్ని మీమ్స్, ట్రోలింగ్ వచ్చింది. హగ్గులకు మాత్రం సిరి చాలా ఫేమస్ అయింది. చివరకు కన్నతల్లి వద్దని చెప్పినా కూడా సిరి వినలేదు. ఆదే ఆమెకు ఎక్కువగా నెగెటివ్ అయింది. వారిద్దరి ఓవరాక్షన్‌ని చూసి దీప్తి ఏకంగా బ్రేకప్ చెప్పేసింది.
శ్రీహాన్ కూడా సిరిని వదిలేసాడంటూ నెట్టింట జోరుగా ప్రచారం నడిచింది. కాని రవి భార్య పోస్ట్‌తో పుకార్లకి బ్రేకప్ పడ్డట్టు అయింది.బిగ్ బాస్ షో తర్వాత ..శ్రీహాన్ కూడా సిరి ఫోటోలు డిలీట్ చేయడంతో పాటు, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక వీరిద్దరూ ఒక్కసారి కూడా కలిసి ఉన్న ఫోటో షేర్ చేయలేదు. దీంతో వీరు కూడా విడిపోతున్నట్టు వార్తలు ప్రచారం అయ్యాయి. శ్రీహన్ కూడా సిరికి బ్రేకప్ చెప్పాడు అంటూ, అందుకే వీరిద్దరూ కలవట్లేదు అని అనుకున్నారు అంతా. ఈ క్రమంలో శ్రీహాన్, సిరి కలిసి యాంకర్ రవి ఇంటికి వెళ్లి టైం స్పెండ్ చేశారు. రవి ఫ్యామిలీతో కలిసి ఫోటోలు దిగి షేర్ చేశారు.
siri and srihan meets anchor ravi family
దీనికి సంబంధించిన ఫోటోలను యాంకర్ రవి భార్య నిత్య సక్సేనా తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది.ఇటీవల వీరిద్దరు కలిసి యాంకర్ రవి కుటుంబాన్ని కలిశారు. వీరంతా కలిసి ఓ రెస్టారెంట్‌లో భోజనం చేసి సందడి చేశారు. ఆ సమయంలో వీరంతా కలిసి దిగిన ఫోటోలను యాంకర్ రవి భార్య నిత్య సక్సేనా తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. మీ ఇద్దరిని కలవడం చాలా సంతోషంగా ఉందంటూ పోస్ట్ చేసింది. ఇందుకు సిరి కూడా హ్యాప్పీ అంటూ స్పందించింది. దీంతో ఇన్ని రోజులుగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న బ్రేకప్ వార్తలకు ఎండ్ కార్డ్ పడింది. ఈ పోస్ట్ పై నెటిజన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.