Home » Entertainment » Siri And Sunny In Bigg Boss 5 Telugu
Entertainment

Bigg Boss 5 Telugu : అక్కడ చెయ్యి పెట్టాడంటూ సిరి రచ్చ.. వీజే సన్నీ టార్గెట్ అయ్యాడుగా!

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: September 15, 2021, 12:16 pm
Advertisement

Bigg Boss 5 Telugu బిగ్ బాస్ 5 తెలుగు Bigg Boss 5 Telugu ఆటలో ఆడ, మగ అనే తేడాను జనాలు అంతగా చూడరు. కానీ కంటెస్టెంట్లు మాత్రం అప్పుడప్పుడు ఉమెన్ కార్డును వాడుతుంటారు. అక్కడ తాకాడు ఇక్కడ తాకాడు అంటూ రచ్చ చేస్తుంటారు. రెండో సీజన్ నుంచి ఇలాంటి ఆరోపణలు వస్తూనే ఉంటాయి. రెండో సీజన్‌లో కౌశల్ మీద భాను కూడా అలాంటి ఆరోపణలే చేసింది. తన ఎదబాగాన్ని తాకాడంటూ చిందులు తొక్కింది. కానీ ఆ తరువాత అసలు నిజం బయటకు వచ్చింది. భానుని జనాలు రిజెక్ట్ చేసి ఎలిమినేట్ చేసేశారు.

Advertisement

Siri and Sunny In Bigg Boss 5 Telugu

 

Advertisement

తాకాడంటూ సన్నీపై సిరి రచ్చ  Bigg Boss 5 Telugu

అలా ప్రతీ సీజన్‌లో ఏదో ఒకసారి ఇలాంటి తప్పుడు ఆరోపణలు వస్తూనే ఉంటాయి. అయితే నిన్నటి ఎపిసోడ్‌లోనూ ఇలాంటి ఓ ఘటనే జరిగింది. బిగ్ బాస్  5 తెలుగు Bigg Boss 5 Telugu  ఇంట్లో రెండు టీంలు.. టాస్కులు ఆడాయి. అందులో వారి వారి దిండ్లను కాపాడుకోవాలనేది టాస్క్. వాటిని ఆడవారు పెట్టుకోకూడని చోట పెట్టుకున్నారు. అందులో సిరి తన దిండ్లను నడుము, ఎద భాగంలో దాచుకుంది. వాటిని తీసేందుకు సన్నీ ప్రయత్నించాడు. కానీ అవి లోపల ఉండటంతో ఆగిపోయాడు.

Siri and Sunny In Bigg Boss 5 Telugu

Advertisement

 

ఎవరైనా తన టీంలోని లేడి కంటెస్టెంట్ వస్తారేమో అని చూశాడు. శ్వేతా వర్మను అరుస్తూ పిలిచాడు. శ్వేతా వచ్చాక సిరి లోపలి దాచుకున్న దిండ్లను బయటకు లాగింది. కానీ షన్ను మాత్రం సన్నీని తప్పుబట్టాడు. చేతులు లోపల పెట్టడం, టచ్ చేయడం ఏంటని ఆరోపించాడు. సిరి కూడా అలానే ప్రవర్తించింది. కానీ సన్నీ మాత్రం వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేశాడు. అయినా సిరి మాత్రం వినలేదు. సన్నీ తప్పు చేశాడన్నట్టుగానే చూసింది.

 

Siri and Sunny In Bigg Boss 5 Telugu

Advertisement

 

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి