siri comments on shanmukh
Shanmukh : బిగ్ బాస్ హౌజ్‌లో షణ్ముఖ్- సిరి చేసిన ఘోరాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కెమెరాలు ఉన్న విషయం కూడా మరచిపోయి వారు దారుణంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో దీప్తి సునయన.. షణ్ముఖ్ బయటకు వచ్చాక అతనికి బ్రేకప్ చెప్పింది. ఐదేళ్ల తమ రిలేషన్‌కు ఫుల్ స్టాప్ పెట్టి ఎవరి లైఫ్ వాళ్లు మొదలుపెట్టారు. షణ్ముఖ్‌కు బ్రేకప్ చెప్తున్నట్లు అధికారికంగా జనవరి 1న పోస్ట్ చేసింది దీప్తి సునయన.. బిగ్ బాస్‌లో ఉన్నపుడు దీప్తిని చాలాసార్లు తలుచుకున్నాడు షణ్ముఖ్ జస్వంత్. తనకు అన్నీ ఆమె అన్నట్లు మాట్లాడాడు. అంతేకాదు.. అక్కడికి ఎవరొచ్చినా కూడా దీప్తి గురించి అడిగేవాడు. అంత ప్రేమించుకున్న ఇద్దరూ ఎందుకు విడిపోయారబ్బా అనేది చాలా మందికి అర్థం కావడం లేదు.
సిరినే కారణం అని కొందరు అంటున్నారు.తాజాగా సిరిని ఇటీవల షణ్ముఖ్ తో కనిపించడం లేదని ఓ యాంకర్ అడగగా, దానికి స్పందించిన సిరి.. బ్రేకప్ తర్వాత కలవడం ఎవరికి మంచిది కాదు కదా. ఎవరి లైఫ్‌లో వారు బిజీగా ఉన్నాం. కొద్ది రోజుల తర్వాత అన్నీచక్కదిద్దుకుంటాయి అని సిరి స్పష్టం చేసింది. అయితే షణ్ముఖ్ జస్వంత్, సిరి హనుమంత్‌లు బిగ్ బాస్ హౌస్‌లోనే కాదు.. ఇప్పుడు ‘క్విక్ ఫిక్షన్’ సిరీస్‌తో సర్ ప్రైజ్ చేయబోతున్నారు. కేవలం వీళ్లిద్దరే కాకుండా సిరి ప్రియుడు శ్రీహాన్.. యూట్యూబర్స్ డాన్ పృథ్వీ, తేజ్ ఇండియా వీళ్లంతా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కాబోతున్నారు.స్టార్ మా మ్యూజిక్‌లో త్వరలో ప్రసారం కాబోతున్న ‘క్విక్ ఫిక్షన్’ సిరీస్ ప్రోమో విడుదల కాగా.. ఇందులో సిరి, షణ్ముఖ్, శ్రీహాన్‌లు కనిపించి సందడి చేశారు.
siri comments on shanmukh
తాజాగా శ్రీహాన్.. సిరిని తలచుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యారు. సిరిని అర్ధం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది.. నాకు ఇప్పటికీ పడుతుంది కూడా.. సిరికి ఏదైనా గోల్ ఉన్నా.. ఏదైనా సాధించాలి అనుకుంటే.. ఖచ్చితంగా చేస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎవరు అడ్డుపడినా అస్సలు పట్టించుకోదు. తాను వైజాగ్‌లో ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చి ఏదైనా సాధించాలని అనుకుంది. యాంకర్‌గా కెరియర్ మొదలుపెట్టి.. సీరియల్స్.. సీరియల్స్ నుంచి మూవీస్.. మొన్న బిగ్ బాస్ వరకూ తన కష్టమే. తాను ఎవ్వరి సపోర్ట్ తీసుకోలేదు. తన కష్టంతోనే వచ్చింది. ఎంతమాట్లాడినా అర్ధం చేసుకోవడం మాత్రం చాలా కష్టం’ అంటూ ఎమోషనల్‌గా మాట్లాడాడు.
Keerthy Suresh : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…
Maha News Channel : హైదరాబాద్‌లోని మహా న్యూస్ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…
Imprisonment : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…
Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…
Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…
Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…
Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…
Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…
This website uses cookies.