Bigg Boss Srihan : తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 5 లో పాల్గొన్న సిరి హనుమంత్ తొలిసారి తన ప్రియుడు శ్రీహాన్ తో ఉన్న రిలేషన్ గురించి చెప్పుకొచ్చింది. ఇటీవల శ్రీహాన్ సిరి కోసం సిరి ఇంటికి వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అరియాన కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది. ఈ ఇంటర్వ్యూలో అరియానా సిరి గురించి సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులను చూపించారు. ఆ పోస్టులో సిరికి శ్రీహాన్ బ్రేకప్ చెప్పేసాడు అని వచ్చిన కామెంట్లకు స్పందించాలని సిరిని అరియానా కోరింది. దానికి స్పందించిన సిరి అదేమీ లేదు..
ఇది నేను బిగ్ బాస్ సీజన్ 5 లో ఉన్నప్పుడు జరిగి ఉంటుందని చెప్పుకొచ్చింది.శ్రిహాన్ నాకు బ్రేకప్ చెప్పేసి ఉంటే ఇప్పుడు ఇలా కలిసి ఉండే వాళ్ళమా అని సిరి అరియానాను అడిగింది. బిగ్బాస్ సీజన్ 5 పూర్తి అయ్యాక తమ ఇద్దరి వ్యక్తిగత జీవితాల్లో చాలా ఇబ్బందులు వచ్చాయని, వాటి గురించి చెబితే ఇలా జరిగిందా అని మీరే షాక్ అవుతారు అనే సిరి చెప్పింది. అలా జరిగిన సంఘటనల్లో ఒకటి రెండు చెప్పాలని అరియానా సిరిని అడిగింది. అయితే శ్రీహాన్ తో బ్రేకప్ అయిందని సిరి అంగీకరించింది. శ్రీహాన్ ఒక్కడే టూర్కు వెళ్లడని ఆ సమయంలో తనకు కోవిడ్ వచ్చిందని, ఆ సమయంలో తాను ఏదో ఒకటి చేసుకుందామని ఆలోచనకి వచ్చానని సిరి బాధగా చెప్పింది.
అసలు ఈ ప్రపంచానికి ఇంట్లో వాళ్లనీ వదిలేసి దూరంగా వెళ్లిపోవాలి అన్న ఆలోచన కూడా వచ్చిందని సిరి చెప్పింది.తనకు కరోనా వచ్చినప్పుడు ఉదయం 6 గంటలకే లేచి మణికొండ రోడ్లపై చెప్పులు లేకుండా తిరిగానని ఇలా ఎన్నో ఇబ్బందులు పడ్డానని సిరి వాపోయింది. అయితే శ్రీహాన్ మళ్లీ వచ్చి తనను ఇంటికి తీసుకెళ్లాడని అలా ఇద్దరి మధ్య బలమైన బంధం ఏర్పడిందని, ఇక ఎప్పటికీ మా బంధం విడిపోనంత బలంగా తమ ఇద్దరి మధ్య ఏర్పడిందని సిరి చెప్పింది. ఇక ఇది ఇలా ఉంటే బిగ్బాస్ హౌస్ లో సిరి షణ్ముఖ్ మధ్య చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఏర్పడింది. వీరిద్దరూ ఇలా క్లోజ్ గా ఉండడంతో చివరకు షణ్ముఖ్ కు తన ప్రియురాలు దీప్తి సునైనా కూడా దూరం అయింది. వీటిని దృష్టిలో పెట్టుకొని సిరి తాను శ్రీహాన్ తో విడిపోతుందన్న పుకార్లు వచ్చాయని సిరి తెలిపింది.
Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్లో ఒక సంవత్సరం అప్రెంటీస్షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
This website uses cookies.