sitara shake social media with her dance
Sitara: మహేష్ , నమ్రతల గారాల పట్టి సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ చిన్నారి చేసే రచ్చ మాములుగా ఉండదు. ఆటలు, పాటలు, డ్యాన్స్‌లు,ఇలా ఒకటేంటి తన సోషల్ మీడియా ద్వారా తెగ సందడి చేస్తుంటుంది. సితార రచ్చకు సోషల్ మీడియా షేక్ అవుతుంటుంది. ఈ మధ్య కాలంలో సితార సోషల్ మీడియాలో మాములు రచ్చ చేయడం లేదు. ఆరేళ్ల వయసులోనే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టి తన యూనిక్ స్టైల్‌తో బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది. తండ్రికి తగ్గ కూతురిగానే కాకుండా తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను ఏర్పరచుకుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సితార తాజాగా తండ్రి, మహేశ్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్‌కు స్టైలిష్ స్టెప్పులేసి మెస్మరైజ్ చేసింది.సితార స్టెప్పలుకి మెస్మరైజ్ అయిన మహేశ్‌బాబు.. ‘మై స్టార్.. నన్ను బీట్ చేసింది’ అంటూ ఇన్‌స్టాలో కూతురిపై ప్రశంసలు కురిపించారు. మహేశ్ భార్య నమ్రత సైతం ఇంకేం చెప్పగలను? లవ్‌యూ మై లిటిల్ వన్ అని పేర్కొంది. ఇక సితార డ్యాన్స్‌కు మహేశ్ అభిమానులు సహా నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆ మధ్య ఒక హాలీవుడ్ మూవీ కి డబ్బింగ్ చెప్పి వావ్ అనిపించుకుంది. 9 ఏళ్ల చిన్న వయసులోనే చదువుతో పాటుసింగర్, డ్యాన్సర్..
sitara shake social media with her dance
మొత్తానికి మల్టీ టాలెంటెడ్ సూపర్ కిడ్ గా పేరు తెచ్చుకుంది.సితార తన ఫ్రెండ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు ఆద్య తో కలిసి ఓ యూట్యుబ్ ఛానల్ ను నిర్వహిస్తోంది. ఈ ఆద్య-సితార యూట్యూబ్ ఛానల్ లో ట్రావెలింగ్ స్టోరీస్, ఛాలెంజస్, గేమ్స్ వంటి అనేక వీడియోలు షేర్ చేస్తూ.. అభిమానులను అలరిస్తుంది. తమ ఫ్యామిలీ తో కలిసి వెళ్ళిన విదేశాలకు సంబంధించిన మంచి మంచి ప్రదేశాలను కూడా తన ఛానల్ లో పోస్ట్ చేస్తూ.. అభిమానులను అలారిస్తోంది. ఇక సోషల్ మీడియాలోను రచ్చ చేస్తుంటుంది. తాజాగా సితార ఓ పాటకు కళ్లు చెదిరేలా డ్యాన్స్ చేసి వావ్ అనిపించింది. ప్రస్తుతం ఆమె డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.