sitara shows her inner talent
Sitara : సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న వయసులోనే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి పలు వీడియోలు చేసి రచ్చచేసింది సితార. అంతేకాకుండా తనకు నచ్చిన పాటకు స్టెప్పులెస్తున్న వీడియోస్ షేర్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో సితారకు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. కేవలం మాటలతోనే కాకుండా.. తనలోని డ్యాన్సింగ్ టాలెంట్.. పెయింటింగ్.. సింగింగ్ టాలెంట్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది. సితార తాజాగా తండ్రి, మహేశ్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్‌కు స్టైలిష్ స్టెప్పులేసి మెస్మరైజ్ చేసింది.
సితార స్టన్నిండ్ డ్యాన్స్‌కి మహేష్ స్పందించాడు. ‘మై స్టార్.. నన్ను బీట్ చేసింది’ అంటూ ఇన్‌స్టాలో కూతురిపై ప్రశంసలు కురిపించారు. మహేశ్ భార్య నమ్రత సైతం ఇంకేం చెప్పగలను? లవ్‌యూ మై లిటిల్ వన్ అని పేర్కొంది. ఇక సితార డ్యాన్స్‌కు మహేశ్ అభిమానులు సహా నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అచ్చం నాన్నలాగే సూపర్‌స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సితార డ్యాన్స్ వీడియో వైరల్ కాగా, ఇప్పుడు సితార తనలో దాగి ఉన్న మరో టాలెంట్ గురించి చూపించి అందరిని ఆశ్చర్యపరిచింది.తన ఫ్రెండ్ మోహనతో కలిసి ప్రకృతికి సంబంధించిన పెయింటింగ్ వేసింది. ఇది చూసిన నమ్రత చాలా హ్యాపీగా ఫీలైంది.
sitara shows her inner talent
ఇక నెటిజన్స్ అయితే సితార టాలెంట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలా అందంగా వేశావు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, సితార తండ్రి నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి రీసెంట్‌గా ‘కళావతి’ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పాటలో మహేష్ బాబు, కీర్తి సురేష్ గ్రేస్ హైలైట్ కావడంతో ఆన్ లైన్ వేదికలపై పలు రికార్డులు తిరగరాస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన వీడియోస్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన కళావతి పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇందులో మహేష్ మరింత హ్యాండ్సమ్ అండ్ స్టైలీష్ లుక్‌తో కనిపించాడు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.