
jabardasth show comes to end
ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో సందర్భానుసారంగా.. స్పెషల్ రోజులు ఏమైనా ఉంటే లేదా పండుగలు ఏదైనా ఉంటే వాటికి తగ్గట్లుగా కామెడీ స్కిట్స్ చేయడం.. నవ్వించడం చేస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం వాలెంటెన్స్ డే సందర్భంగా జబర్దస్త్ ప్రత్యేకమైన ఎపిసోడ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఎపిసోడ్ లో జబర్దస్త్ లో ప్రేమ జంటలుగా చలామణి అవుతున్న వారందరు కూడా ఒకరికి ఒకరు ఐలవ్యూ చెప్పుకున్నారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సుడిగాలి సుదీర్ మరియు రష్మిల ప్రేమ వ్యవహారం కాకుండా ఇంకా పలు ప్రేమ జంటలు జబర్దస్త్ లో చలామణి అవుతున్నాయి. అందులో ఒకటి ఇమాన్యుల్ మరియు వర్ష.వీరిద్దరు కలిసి గత మూడు సంవత్సరాలుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.
వీరు ఇద్దరిని చూస్తే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అన్నట్లుగా ఉంటుంది. వారు కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంటారు. తమది నిజమైన ప్రేమ అంటూ పదే పదే నిరూపించుకునేందుకు జబర్దస్త్ వేదిక మీద ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక రాకేష్ మరియు జోర్దార్ సుజాత లో కొత్తగా ప్రేమ వ్యవహారాన్ని మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. సుజాత స్వయంగా తనకి రాకేష్ కింగ్ అంటూ ప్రస్తావించడంతో అంతా ఆశ్చర్యపోయారు. నిజంగానే వీళ్ళ మధ్య ప్రేమ ఉందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మరో వైపు నరేష్ ప్రేమ వ్యవహారం కూడా కొనసాగుతోంది. తాజా ఎపిసోడ్ లో ఆమెకు చైను ఇచ్చి మరీ ప్రపోజ్ చేశాడు.ఇక చివరగా పైమా మరియు ప్రవీణ్ జోడి. వీరిద్దరికీ సంబంధించిన వ్యవహారం నాలుగు సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ నాలుగు సంవత్సరాలుగా ప్రవీణ్ ప్రతి వేదిక ఐ లవ్ యు అని చెప్పడం… ఆమె నవ్వడం చేస్తుంది. ఇటీవల వీళ్ళ యూట్యూబ్ ఛానల్ లో కూడా ఆ వ్యవహారాన్ని సాగదీశారు. నాలుగు సంవత్సరాలుగా ఐలవ్యూ అని చెబుతూ తిరుగుతుంటే చాలా సంతోషంగా ఉందని..
so many fake love stores in jabardast comedy show
ప్రేమించబడడం చాలా సంతోషాన్ని కలిగిస్తుందని ఆమె చేసిన వ్యాఖ్యలు అతడి ప్రేమను అంగీకరించినట్లుగానే అనిపించాయి. ఈ మొత్తం నాలుగు జంటల్లో కేవలం ఫైమా మరియు ప్రవీణ్ ల ప్రేమ వ్యవహారమే జెన్యూన్ గా అనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మిగతా వారు కేవలం కామెడీ స్కిట్స్ కోసమే నటిస్తున్న అనిపిస్తుంది అంటున్నారు. ప్రవీణ్ ఐలవ్యూ చెబుతున్న సమయంలో అతని నిజాయితీ కనిపిస్తుంది.. ఫైమాలో సిగ్గు మొహమాటం కనిపిస్తూ ఉంటుంది. కనుక వారు ఇద్దరు నిజమైన ప్రేమలో ఉన్నారేమో అని అనిపిస్తుంది. వాళ్లది కూడా నిజమైన ప్రేమ కాకపోతే చేసేది ఏమీ లేదు. వీళ్లు మాత్రమే కాకుండా వచ్చే వాలెంటైన్స్ డే వరకు ఇంకెంత మంది జోడీలు గా జబర్దస్త్ లో సందడి చేస్తారో చూడాలి. మరీ జోడీలు ఎక్కువైనా కూడా ప్రేక్షకులకు విరక్తి పుట్టే అవకాశం ఉంది కనుక మల్లెమాల వారు ఆ విషయంలో జాగ్రత్త పడితే బెటర్.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.