
software blues movie promotional video viral
Software Blues : ఆ మధ్య కుర్ర హీరో విశ్వక్సేన్ ఏం చేశాడో తెలుసు కదా. తన మూవీ అశోకవనంలో అర్జున కళ్యాణం కోసం ఏకంగా నడిరోడ్డు మీద ఓ ప్రమోషనల్ వీడియో చేసి అడ్డంగా బుక్కయ్యాడు. ప్రాంక్ వీడియో పేరుతో అప్పుడు చేసిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. ఆ వీడియో వల్ల విశ్వక్సేన్ సినిమాకు మాత్రం సూపర్బ్ గా ప్రమోషన్ జరిగింది. లక్షలు ఖర్చు పెట్టినా రాని పబ్లిసిటీ అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాకు వచ్చింది. తాజాగా విశ్వక్సేన్ లా మరో మూవీ టీమ్ కూడా తమ మూవీ కోసం ఓ ప్రాంక్ వీడియోను చేసింది. అది కూడా ఇంచు మించు ప్రమోషనల్ వీడియోనే. కానీ.. ఇది ప్రమోషనల్ వీడియో అన్నట్టుగా మాత్రం లేదు. సూపర్బ్ గా చేశారు. ఒక మంచి ఐడియాతో సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. సాఫ్ట్ వేర్ బ్లూస్ అనే ఓ సినిమా ఈనెల 24న రిలీజ్ కాబోతోంది.
అంటే శుక్రవారం అన్నమాట. ఈ సినిమాలో హీరో శ్రీరామ్ నిమ్మల. హీరోగా తనకు ఇది రెండో సినిమా. శ్రీరామ్ తొలి మూవీ ఉత్తర. సాఫ్ట్ వేర్ బ్లూస్ సినిమా తర్వాత శ్రీరామ్ తురుమ్ ఖాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. హీరోయిన్ ను కూడా ఈ వీడియోలో చూడొచ్చు. సినిమా ప్రమోషన్స్ కోసం ఏం చేద్దాం.. ఎలా ప్లాన్ చేద్దాం అని హీరో, హీరోయిన్, మరో వ్యక్తి రోడ్డు పక్కన మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఓ యువకుడు స్కూటీ మీద వస్తాడు. ఏం చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడేం షూట్ చేయకండి.. ఏదైనా ఉంటే బయటికి వెళ్లి చేసుకోండి అంటాడు. కాలనీలో డిస్టర్బ్ అవుతుంది. ఇదివరకే ఓ లొల్లి అయింది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటాడు. హీరో శ్రీరామ్ మాత్రం ఒక్క రెండు నిమిషాలు భయ్యా.. మెయిన్ రోడ్ మీద మేము ఏం చేయట్లేదు. గల్లీలోనే చేస్తున్నాం. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగదు అంటాడు. కానీ.. ఆ యువకుడు వినడు. ఇంతలో తనతో పాటు వచ్చిన మరో వ్యక్తి.. ఆ యువకుడిపై సీరియస్ అవుతాడు. తన చేతుల్లో ఉన్న లాప్ టాప్ ను ఆ యువకుడు తీసి విసిరికొడతాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెద్దవుతుంది. హీరో శ్రీరామ్ ఎంత ఆపాలని చూసినా వాళ్లు ఇద్దరూ ఆగరు.
software blues movie promotional video viral
ఇద్దరూ కొట్టుకుంటారు. చివరకు ఆ యువకుడిని శ్రీరామ్ ఆపుతాడు. ఆ తర్వాత గొడవ సద్దుమణుగుతుంది. నిజానికి.. ఇదంతా మూవీ ప్రమోషన్స్ లో భాగమే కానీ.. అసలు ఇది మూవీ ప్రమోషనల్స్ భాగం కాదన్నట్టుగా.. వీడియోను షూట్ చేశారు. ఇద్దరు కొట్టుకుంటుండగా శ్రీరామ్ వాళ్లను ఆపే ప్రయత్నం చేయడం.. గొడవ స్టార్ట్ కాగానే హీరోయిన్ అక్కడి నుంచి వెళ్లిపోవడం.. అంతా సరికొత్తగా ఉంటుంది. ఏది ఏమైనా.. సినిమా ప్రమోషన్స్ కోసం వినూత్న పద్ధతిలో ఆలోచించి వీడియో చేసినందుకు సాఫ్ట్ వేర్ బ్లూ మూవీ యూనిట్ ను నెటిజన్లు తెగ పొడుగుతున్నారు. ప్రాంక్ వీడియో బాగుంది.. అంటూ మెచ్చుకుంటున్నారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా.. ప్రాంక్ బాగా చేశారు.. ఆల్ ది బెస్ట్ అంటూ హీరో, హీరోయిన్, డైరెక్టర్ ను తెగ మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి మరి.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.