
JR NTR : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెండవ సినిమాకి రంగం సిద్దం అవుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే అరవింద సమేత వీరరాఘవ వచ్చి మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రూపొందబోతుండగా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కించబోతున్నాడు త్రివిక్రమ్. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా భారి బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
solid-update-for-ntr-trivikram-pan-india-movie
ఇక ఈ సినిమా షూటింగ్ కి డేట్ ఫిక్స్ చేసినట్టు లేటెస్ట్ అప్‌డేట్. అంతేకాదు ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో వచ్చే ఈ క్రేజీ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేసేందుకు కూడా త్రివిక్రమ్ డేట్ ని ఫిక్స్ చేసినట్టు తాజా సమాచారం. ఏప్రిల్ 2 నుండి ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ల పాన్ ఇండియన్ సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు మేకర్స్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఈ సినిమా నుంచి టీజర్ ను ఎన్టీఆర్ పుట్టినరోజు అయిన మే 20 కి రిలీజ్ చేస్తారట. ఇందుకు సంబంధించిన పక్కా ప్లాన్ తో దర్శకుడు త్రివిక్రమ్ ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జంటగా ఇద్దరు హీరోయిన్స్ నటించాల్సి ఉందట. వారిలో ఒక హీరోయిన్ పూజా హెగ్డే ని మరొక హీరోయిన్ అతిలోక సుందరి .. అందాలతార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించే అవకాశాలున్నాయని సమాచారం. అంతేకాదు జాన్వీ కపూర్ డెబ్యూ సినిమా ఎన్టీఆర్ తో అన్న మాట ఎప్పటి నుంచో వినిపిస్తోంది. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీం గా నటిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నతిస్తున్నాడు.
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.