
somany doubts on mahesh babu sarkaaru vaari pata
Mahesh Babu : బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ మాదిరిగా గత 5 ఏళ్ళుగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుసగా హిట్స్ అందుకుంటూ డబుల్ హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయ్యాడు. తెలుగులో మహేశ్ బాబు మాదిరిగా కంటిన్యూ హిట్స్ అందుకున్న మరో హీరో లేడని చెప్పక తప్పదు. శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు..ఇలా చేసిన ప్రతీ సినిమా మహేశ్‌కు భారీ కమర్షియల్ హిట్ ఇచ్చింది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీగా పోటీ పడిన మహేశ్ సరిలేరు నీకెవ్వరు భారీ వసూళ్ళు రాబట్టి బాక్సాఫీస్ కా బాప్ అనిపించుకున్నాడు.అయితే, ఆ తర్వాత చేయాల్సిన సినిమా విషయంలో మాత్రం మహేశ్ చాలా ఆలోచించాడు.
వాస్తవంగా మహేశ్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వచ్చిన మహర్షి సినిమాకు అవార్డుల పంట పండింది. పలు దేశాలలోనూ ఈ సినిమాను ప్రదర్శించారు. దాంతో మరో సినిమాను కూడా వంశీతో చేసేందుకు ఓకే అన్నాడు. లైన్ నచ్చిన మహేశ్ పూర్తి స్క్రిప్ట్ విన్న తర్వాత మాత్రం నిర్మొహమాటంగా వంశీ పైడిపల్లికి నో చెప్పాడు. ఇక మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య సినిమాలో చేయాల్సింది. ఈ సినిమాలో నటించేందుకు మహేశ్ రెమ్యునరేషన్ కూడా దాదాపు రూ.40 కోట్ల వరకు అందుకుంటున్నాడని వార్తలు వచ్చాయి.కానీ, కరోనా కారణంగా ఈ సినిమా బడ్జెట్ తగ్గించాలనుకున్న మేకర్స్ మహేశ్ బదులు చరణ్‌ను తీసుకువచ్చారు. దాంతో మహేశ్ కంప్లీట్‌గా మనసు మార్చుకొని పరశురామ్ చెప్పిన సర్కారు వారి పాట సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకోగా మే 12న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
somany doubts on mahesh babu sarkaaru vaari pata
అఫీషియల్‌గా రిలీజ్ కూడా అనౌన్స్ చేశారు. అయితే, ఇప్పుడు అదే వారంలో హాలీవుడ్ క్రేజీ సినిమా రిలీజ్ అవుతోంది. దాంతో తప్పకుండా మహేశ్ సినిమాపై గట్టిగా ప్రభావం చూపిస్తుందని ఇప్పుడు కొత్త డేట్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుకున్న సమాచారం మేరకు సినిమా రిలీజ్ అయ్యే వరకు హిట్ అని చెప్పడం కష్టమట. పోకిరి వైబ్స్ అని మేకర్స్ ఊదరగొ డుతున్నా టాక్ మాత్రం లోలోపల రివర్స్‌లో వినిపిస్తోంది. ఇక కీర్తి సురేశ్ సెంటిమెంట్ కూడా ఒకటుంది. ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద తిరగబడుతున్నాయి. ఈ విషయంలో కూడా బాబుకు హిట్ దక్కేనా అని మాట్లాడుకుంటున్నారు. థమన్ మ్యూజిక్ కూడా సో సోగానే ఉంది. ఇలాంటి బోలేడు నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఫైనల్‌గా సర్కారు వారు పాట ఎలా వినబడుతుందో.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.