sonu sood saved a chaild tejakrishna by heart surgery
Sonusood : రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పేదలకి ఏ క్షణాన ఎలాంటి అవసరం వచ్చిన నేనున్నాను అంటూ నటుడు సోనూసూద్ తన అభయ హస్తాన్నిస్తున్న సంగతి తెలిసిందే. అంతక ముందు సోనూసూద్ అంటే ఓ నటుడుగానే పరిచయం. తెలుగు, తమిళం, హిందీ సినిమాలలో ఎక్కువగా విలన్ పాత్రల్లో నటించేవాడు. ఆ రకంగా జనాలలో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉండేది. ముఖ్యంగా అరుంధతి సినిమాలో పోషించిన పసుపతి పాత్ర జనాల మనసులో సోనూని మరీ విలన్ ని చేసేసింది. ఇక కమర్షియల్ సినిమాల పరంగా చూస్తే సోనూకి అంత క్రేజ్ నిజంగా ఉండేది కాదు.
కానీ గత ఏడాది కరోనా బారిన పడిన వారికి..దీని వల్ల ఉపాది కోల్పోయిన వారికి..అన్నీ రకాలుగా అండదండలు చూపించాడో అప్పటి నుంచి సోసైటీలో సినీ ప్రేమికుల్లో సోనూసూద్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఆయన ఇప్పుడు నటుడుగా కంటే ఓ సమాజ సేవకుడిగా కనిపిస్తున్నాడు. ప్రజలే ఆయనని ఇప్పుడు దేవుడుగా భావిస్తున్నారు. ప్రతీ పార్టీ నాయకులు సోనూ సోవను ప్రశంసిస్తున్నారు. ఇంత చేస్తున్న సోనూసూద్ మీద కొన్ని సందేహాలు ఉన్నాయి. అవన్నీ ఆయన చేస్తున్న సేవ ముందు అలా రాలిపోతున్నాయి. ఈ క్రమంలో ఈ జన సేవకుడు మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గుండె జబ్బుతో బాధపడుతున్న ఏడాది చిన్నారి ప్రాణాలకు రక్షగా నిలిచాడు.
sonu sood saved a chaild tejakrishna by heart surgery
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్దిపల్లి మండలం రాజాపురం గ్రామానికి భాస్కరరావు, సత్య దంపతులకు తేజాకృష్ణ అనే ఏడాది కొడుకున్నాడు. ఆటో నడుపుకునే భాస్కరరావు కొడుకు తేజకు గుండె జబ్బ రావడంతో.. ఆపరేషన్ చేయాలనీ వైద్యులు చెప్పారు. దీని కోసం తమ ఆర్ధిక పరిస్థితికి మించి ఖర్చు పెట్టారు భాస్కరరావు. ఇదే సమయంలో విషయం తెలుసుకున్న జన విజ్ఞాన వేదిక సోషల్ మీడియా లో షేర్ చేసింది. చిన్నారిని ఆదుకోవాలంటూ సోనూని కోరింది. దాంతో వెంటనే స్పందించిన సోనూ, తేజకు వైద్యం చేయించే బాధ్యతను తీసుకున్నారు. ముంబయిలోని ఎస్‌ఆర్‌సీసీ పిల్లల ఆసుపత్రిలో గురువారం రోజు శస్త్రచికిత్స చేయించారు. ప్రస్తుతం చిన్నారి తేజాకృష్ణ ప్రాణాలకేమీ ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
This website uses cookies.